Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' కోసం రంగంలోకి అగ్ర హీరోలు.. మ‌ణిర‌త్నం ఐడియా అదుర్స్

Updated on Sep 27, 2022 07:36 PM IST
'పొన్నియిన్ సెల్వ‌న్ 1' (Ponniyin Selvan 1) ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది.  ఈ సినిమాను మ‌ణిర‌త్నం కొత్త ఐడియాతో వివిధ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.
'పొన్నియిన్ సెల్వ‌న్ 1' (Ponniyin Selvan 1) ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మ‌ణిర‌త్నం కొత్త ఐడియాతో వివిధ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.

'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1) సినిమా ప్ర‌మోష‌న్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో సెప్టెంబ‌ర్ 30 న తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్, కార్తీ, త్రిష‌, శోభిత ధూళిపాళ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. చోళ రాజుల చరిత్ర‌గా ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. 

'పొన్నియిన్ సెల్వ‌న్' (Ponniyin Selvan 1) ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కొత్త ఐడియాతో వివిధ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా పొన్నియిన్ సెల్వ‌న్ ఉంటుంద‌ట‌. తెలుగులో చిరంజీవి, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, కన్నడలో ఉపేంద్ర అలాగే హిందీలో అజయ్ దేవగన్ వాయిస్ అందించినట్టు తెలుస్తోంది. వివిధ‌ భాషల్లో రిలీజ్ అయ్యే పొన్నియిన్ సెల్వ‌న్ సినిమాను హీరోల వాయిస్‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేయ‌నున్నారు మ‌ణిర‌త్నం. 

ఏ పాత్ర‌లో ఎవ‌రు

ఆదిత్య కరికాలన్ రాజు పాత్ర‌లో చియాన్ విక్ర‌మ్ న‌టించారు. యోధ యువరాజు వల్లవరైయన్ వంతీయతేవన్ పాత్ర‌లో కార్తీ, రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ న‌టించారు. చోళ యువరాణి కుందవై పిరత్తియార్ పాత్రలో త్రిష క‌నిపించారు. రాజ రాజ చోళగా పొన్నియన్ సెల్వన్ గౌరవం అందుకున్నారు. జయం రవి అరుల్మొళి వర్మన్ (పొన్నియన్ సెల్వన్) పాత్రను పోషించారు.

'పొన్నియిన్ సెల్వన్‌ '  సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ ప్రాచీన న‌వ‌ల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వ‌న్ ' తెర‌కెక్కుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

Read More: Ponniyin Selvan 1: 'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైల‌ర్ కోసం ఏక‌మైన కోలీవుడ్.. చోళ రాజుల పాల‌న‌పై మ‌ణిర‌త్నం సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!