Cobra Movie Review: చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) వన్‌ మ్యాన్ షో.. రన్‌ టైమ్‌ ఎక్కువైంది

Updated on Aug 31, 2022 02:35 PM IST
దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా థియేటర్లలో విడుదలైంది
దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా థియేటర్లలో విడుదలైంది

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటించిన తాజా చిత్రం కోబ్రా. తమిళంలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్ చేశారు.

విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్‌ చేసి అదే పేరుతో రిలీజ్ చేశారు.

'డీమాంటీ కాలనీ, అంజలి సీడీఐ' చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 2019లో కోబ్రా సినిమా షూటింగ్ మొదలైంది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. చాలాకాలం తర్వాత థియేటర్లలో విక్రమ్ సినిమా రిలీజ్ అవుతుండడంతో కోబ్రా సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. భారీ అంచనాల మధ్య బుధవారం విడుదలైన కోబ్రా సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఎటువంటి టాక్‌ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం.

కథేంటంటే..

స్కాట్లాండ్ ప్రిన్స్‌ బహిరంగ హత్య కేసiను ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్). ఏడాది క్రితం ఇండియాలో జరిగిన ఒడిస్సా సీఎం హత్య కూడా అదే తీరులో జరిగిందని తెలుసుకుంటారు. ఈ రెండు హత్యల వెనుక ఉన్నది.. ఎవరు? మేథమెటీషియన్ మది (విక్రమ్)కు ఈ హత్యలకు లింక్ ఏంటి? అనేది 'కోబ్రా' సినిమా కథ.

దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా థియేటర్లలో విడుదలైంది

ఎవరెలా నటించారంటే..?

విభిన్నమైన గెటప్‌లు వేసి ప్రేక్షకులను అలరించే విక్రమ్‌.. కోబ్రా సినిమాలో ఏకంగా పది రకాల వేషాలు వేసి అభిమానులను మెస్మరైజ్ చేశారు. తన రెండు విభిన్న షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతోనూ ఆకట్టుకున్నారు విక్రమ్. విక్రమ్‌కి ఈ తరహా పాత్రలు పోషించడం, నటించడం వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. అయితే ఆ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బాగుంది.

విలన్‌గా మలయాళ నటుడు రోషన్ మేథ్యూ నటన ఆకట్టుకునేలా ఉంది. రోషన్‌ క్యారెక్టర్‌‌ను బాగానే చూపించే ప్రయత్నం చేసినప్పటికీ విలన్‌కు సరైన గోల్‌ లేకపోవడంతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ కాలేదు. ఇక, హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షీ గోవిందరాజన్, జాన్ విజయ్ తమ పరిధిమేరకు బాగానే నటించారు. సినిమాల్లోకి అరంగేట్రం చేసిన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ స్క్రీన్ ప్రెజెన్స్‌ బాగానే ఉంది. ఎక్స్‌ప్రెషన్స్‌ కోసం ఎక్కువగా అతడిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా క్యారెక్టర్‌‌ను డిజైన్ చేశారు.

విక్రమ్‌తో ఎటువంటి సినిమా తెరకెక్కించవచ్చో సరిగ్గా అటువంటి కథతోనే సినిమా తీశారు దర్శకుడు దర్శకుడు అజయ్ జ్ణానముత్తు. కోబ్రా సినిమాలో విక్రమ్ క్యారెక్టరైజేషన్ అపరిచితుడు చిత్రానికి దగ్గరగా ఉంటుంది. 'రేసు గుర్రం' సినిమాలోని శ్రుతిహాసన్ పాత్రను కూడా గుర్తు చేస్తుంది.

టెక్నికల్‌గా..

సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం, ట్విస్టులను ఎలివేట్ చేసిన తీరు దర్శకుడి టాలెంట్‌ను మనకు తెలియజేస్తాయి. విక్రమ్‌ను బాగా చూపించాలనే తపనతో రన్‌ టైమ్‌ గురించి పట్టించుకోలేదు. అంతేకాకుండా విక్రమ్ చిన్నప్పటి సన్నివేశాలు, ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ ఎక్కువసేపు సాగదీసినట్టు అనిపిస్తాయి.  ఏఆర్‌‌ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్‌ అనే చెప్పాలి. అయితే రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించినట్టుగా మాత్రం అనిపించలేదు. విక్రమ్ అభిమానులు ఆయన విభిన్న నటనను చూడడానికి మాత్రం కోబ్రా సినిమాకు వెళ్లచ్చు.

ఒక్క మాటలో.. విక్రమ్‌ వన్‌ మ్యాన్ షో

 

నటీనటులు : చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), శ్రీనిధి శెట్టి

దర్శకుడు : అజయ్ జ్ఞానముత్తు

మ్యూజిక్ : ఏఆర్‌‌ రెహమాన్

ఎడిటింగ్‌: భువన్‌ శ్రీనివాసన్

బ్యానర్‌: ఎన్‌వీఆర్‌‌ సినిమా

విడుదల తేదీ: 31–08–2022

రేటింగ్‌: 2 / 5

Read More : Vikram: అభిమానులకు మరింత చేరువగా చియాన్ విక్రమ్.. ట్విట్టర్‌‌లో అకౌంట్‌ ఓపెన్ చేస్తున్నట్టు వీడియో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!