సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న అక్కినేని అఖిల్ (Hero Akhil).. సంక్రాంతి బరిలో 'ఏజెంట్' (Agent)!

Updated on Oct 27, 2022 04:17 PM IST
'ఏజెంట్' సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ (Agent Teaser Glimpse) ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.
'ఏజెంట్' సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ (Agent Teaser Glimpse) ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.

అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “ఏజెంట్” (Agent). ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. స్పై థ్రిల్ల‌ర్‌గా  రాబోతున్న ఈ మూవీలో అఖిల్ సరసన ముంబయి బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ఇమేజ్ ఉన్న సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, సురేంద‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ (Agent Teaser Glimpse) ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాలోని అఖిల్ మేకోవర్‌కు ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అయితే, అంతకుముందు ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమాను 2023 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

అఖిల్ పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని రివీల్ (Agent Release Date Poster) చేసి ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. దీంతో ఎప్పుటి నుంచో ఎదురు చూస్తున్న ఈ అవైటెడ్ అప్డేట్ పై ఫైనల్‌గా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ పోస్టర్‌లో అఖిల్ చాలా డిఫరెంట్‌గా.. మంచి ఇంటెన్స్ లుక్‌లో ఓ పర్ఫెక్ట్ స్పై గెటప్‌లో కనిపిస్తున్నాడు. 

కాగా, ఇప్పటికే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతుండగా.. ఆ లిస్ట్‌లో అఖిల్ సినిమా కూడా చేరింది. ప్రస్తుతానికి చిరు 'వాల్తేరు వీరయ్య', ప్రభాస్ 'ఆదిపురుష్' (Adi Purush), విజయ్ 'వారసుడు' (Varasudu) సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకోగా.. కొత్తగా అఖిల్ 'ఏజెంట్', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' కూడా ఆ పండగకే విడుదల కాబోతున్నాయి. 

మరోవైపు.. 'ఏజెంట్' చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి (Mammotty) కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. హిప్ హాప్ త‌మిజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. రైట‌ర్‌, డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ చిత్రానికి క‌థ‌ను అందించారు.

Read More: Akkineni Akhil: పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'తమ్ముడు' (Thammudu) టైటిల్‌తో అఖిల్ తదుపరి సినిమా..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!