సంక్రాంతి (Sankranti Movies) పందెంకోళ్లు: అటు బాలయ్య, ఇటు చిరు, ప్రభాస్.. మధ్యలో విజయ్, అఖిల్!

Updated on Oct 27, 2022 04:06 PM IST
వచ్చే సంక్రాంతి బరిలోకి ఐదు భారీ సినిమాలు దిగుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ తప్పేలా లేదు
వచ్చే సంక్రాంతి బరిలోకి ఐదు భారీ సినిమాలు దిగుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ తప్పేలా లేదు

తెలుగు సినిమాలకు సంక్రాంతి చాలా పెద్ద సీజన్. పండుగ సెలవుల్లో థియేటర్లకు వెళ్లేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఒకరకంగా ఫెస్టివల్ టైమ్‌లో వాళ్లకు అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మూవీస్ కూడా ఒకటి. అందుకే ఈ సంక్రాంతి బరిలో తమ చిత్రాలను బరిలో దించేందుకు స్టార్ హీరోలు ప్రయత్నిస్తుంటారు. ఒకేసారి మూడ్నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి వాటి మధ్య పోటీ కూడా అదేస్థాయిలో ఉంటుంది. 

సంక్రాంతి రేసులో పందెం కోళ్లు

వచ్చే ఏడాది కూడా సంక్రాంతి రేసులోకి బడా చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. మెగాస్టార్ నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే సంక్రాంతి బెర్త్‌‌ను ఖాయం చేసుకున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన ‘ఆదిపురుష్​’ మూవీని సంక్రాంతికే విడుదల చేస్తానని ప్రకటించారు. రీసెంట్‌గా అక్కినేని వారసుడు అఖిల్ ‘ఏజెంట్’, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చిత్రం ‘వారసుడు’ కూడా పండగకే రావడం ఖాయమైంది. దీంతో ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ తప్పేలా లేదు. 

దిల్ రాజుకు తలనొప్పి తప్పదా?

ప్రభాస్, చిరు, బాలయ్య, విజయ్, అఖిల్ ఒకేసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం దాదాపు కన్ఫర్మ్ అనే చెప్పాలి. పండగకు ముందు ఎవరైనా బరిలో నుంచి తప్పుకుంటారేమో చూడాలి. కానీ ప్రస్తుతానికి చూస్తే మాత్రం ఈ ఐదుగురి సినిమాలు పొంగల్ బరిలో ఉండనున్నాయి. అదే ఖాయమైతే థియేటర్ల సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ బడా చిత్రాలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాంలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. విశాఖ ఏరియా కూడా ఆయనే చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు థియేటర్ల సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాలి. 

‘వారసుడు’కు ఓపెనింగ్స్ వస్తాయా?

ఇకపోతే, తలపతి విజయ్ నటిస్తున్న బైలింగ్యువల్ చిత్రం ‘వారసుడు’. ఒకవిధంగా తెలుగులో ఆయనకు ఇది స్ట్రెయిట్ సినిమా. ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు కావడం గమనార్హం. ఒకేసారి బాలయ్య, చిరు చిత్రాలు సంక్రాంతికి రిలీజైతే.. ‘వారసుడు’కు తెలుగు నాట భారీ ఓపెనింగ్స్ రావడం కష్టమే. ఎంత కాదన్నా మన సినిమాలను ముందు చూడాలని మన ప్రేక్షకులు భావిస్తారు. వాటి తర్వాతే విజయ్ ‘వారసుడు’ చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ బాగుంటే సక్సెస్ రన్ కొనసాగుతుంది లేకపోతే తెలుగులో సినిమా ఆడటం కష్టంగా మారుతుంది. 

వాయిదా కష్టమే!

తమిళులకు కూడా సంక్రాంతి పెద్ద పండుగ. అక్కడ సినిమాకు పొంగల్ మంచి సీజన్. అందువల్ల విజయ్ సినిమా అక్కడ కీలకం. తెలుగులో పోటీ ఉన్నప్పటికీ ‘వారసుడు’ను వాయిదా వేయలేని పరిస్థితి. మరి, దిల్ రాజు ఈ సినిమా విడుదల తేదీ విషయంలో వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి. ఇక, అక్కినేని అఖిల్ కూడా భారీ సినిమాల మధ్య ‘ఏజెంట్’తో రేసులోకి దిగుతున్నారు. మరి, సంక్రాంతికి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.  

Read more: ‘లైగర్’ (Liger) ఎఫెక్ట్: పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)కు బెదిరింపులు.. 27న ధర్నా చేస్తామని బయ్యర్ల వార్నింగ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!