ట్రెండింగ్‌లో చిరంజీవి(Chiranjeevi) టైటిల్ టీజర్..9మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య

Updated on Oct 26, 2022 06:50 PM IST
మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటిస్తున్న 154వ సినిమాకు వాల్తేరు వీరయ్య  టైటిల్‌ ఖరారు చేసి టైటిల్‌ టీజర్‌‌ రిలీజ్ చేశారు మేకర్స్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న 154వ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్‌ ఖరారు చేసి టైటిల్‌ టీజర్‌‌ రిలీజ్ చేశారు మేకర్స్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తోందంటేనే అభిమానులకు పండుగ. దసరా పండుగ రోజు ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చారు చిరు. గాడ్‌ఫాదర్ సినిమాను రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన లూసిఫర్‌‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించిన గాడ్‌ఫాదర్. మెగాస్టార్ చిరంజీవితోపాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, లేడీ సూపర్‌‌స్టార్ నయనతార, సత్యదేవ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, బ్రహ్మాజీ, షఫీ కీలకపాత్రలు పోషించారు.

ఇక, దీపావళి కానుకగా అభిమానులకు మరో గిఫ్ట్ ఇచ్చారు చిరు. బాబి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మెగా154 సినిమా టైటిల్‌ టీజర్‌‌ను రిలీజ్ చేశారు. మెగా154 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ టీజర్‌‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మాస్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలాకాలం తర్వాత చిరంజీవి మాస్‌ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటిస్తున్న 154వ సినిమాకు వాల్తేరు వీరయ్య  టైటిల్‌ ఖరారు చేసి టైటిల్‌ టీజర్‌‌ రిలీజ్ చేశారు మేకర్స్

చిరు క్రేజ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా..

దీపావళి కానుకగా విడుదలైన "వాల్తేరు వీరయ్య" టైటిల్ అనౌన్స్‌మెంట్‌ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ టీజర్‌‌ను యూట్యూబ్‌లో తొమ్మిది మిలియన్ల మందికిపైగా వీక్షించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్1 పొజిషన్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది వాల్తేరు వీరయ్య టీజర్. మెగాస్టార్ చిరంజీవి మాస్ గెటప్‌ ఆకట్టుకుంటోంది.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలోని మరో కీలకపాత్రలో మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శృతిహాసన్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. దసరా పండుగకు గాడ్‌ఫాదర్‌‌తో పలకరించిన చిరంజీవి (Chiranjeevi).. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి థియేటర్లలో ప్రేక్షకులకు ఉర్రూతలూగించడానికి చేయడానికి రెడీ అవుతున్నారు.

Read More : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) క్రేజ్‌ను మరోసారి నిరూపించిన ‘గాడ్‌ఫాదర్’(GodFather).. మళ్లీ పెరిగిన వసూళ్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!