Megastar Chiranjeevi: బాలకృష్ణ, నాగార్జున బాటలో మెగాస్టార్ చిరంజీవి.. ఆందోళనలో ఫ్యాన్స్.. కారణమేంటంటే?

Updated on Jul 09, 2022 02:51 PM IST
బాలకృష్ణ, చిరంజీవి, అక్కినేని నాగార్జున (Balakrishna, Chiranjeevi, Nagarjuna)
బాలకృష్ణ, చిరంజీవి, అక్కినేని నాగార్జున (Balakrishna, Chiranjeevi, Nagarjuna)

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మంచి కథ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇటీవలే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. ఇంత భారీ చిత్రం అయినా కూడా అనుకున్న మేరకు కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో చిరంజీవి తన తరువాతి సినిమాలపై దృష్టి పెట్టారు. 

ఇదిలా ఉంటే.. ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఏలిన నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సీనియర్ హీరోలుగా మారిపోయారు. వయసు మీద పడిన క్రమంలో మరోపక్క కుర్ర హీరోలు రాణించడంతోపాటు సినిమా రంగంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురు హీరోలు వినూత్నంగా కెరీర్ ని ముందుకు సాగనంపుతున్నారు. 

ఈ క్రమంలో చిరంజీవి ఇప్పటికే గాడ్ ఫాదర్ (God Father Movie), వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి సినిమాలను చేస్తున్నారు. చేతిలో ఉన్న ఈ మూడు చిత్రాలే కాకుండా.. మరో రెండు సినిమాలను కూడా త్వరలో అనౌన్స్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుత కాలంలో కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని ఓటీటీలలో సినిమాలను, వెబ్ సిరీస్ లను చూడటానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలని దర్శకనిర్మాతలకు సూచించారట. ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత ఓటిటి కంటెంట్ మరియు కార్యక్రమాలపై చిరంజీవి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

కాగా, మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీ (Chiranjeevi OTT Entry) ఇవ్వడంపై వస్తున్న వార్తలను తెలుసుకున్న అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపిక విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ కొంత ఆందోళనలో పడ్డారు. 

ఇదిలా ఉంటే.. సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇప్పటికే ఈ దారిని ఎంచుకున్నారు. బాలకృష్ణ “ఆహా” (Aha OTT) ఓటిటి ప్లాట్ ఫామ్ లో “అన్ స్టాప్పబుల్” అనే టాకీ షోతో హోస్టింగ్ చేసి..హోస్ట్ పరంగా కూడా తనకి ఇప్పటికే తిరుగులేదని బాలయ్య నిరూపించుకున్నారు. మరోపక్క బాలయ్య కంటే ముందుగానే నాగర్జున.. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో చేయడం తర్వాత బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. 

Read More: బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎప్పటి నుంచి అంటే.. ముహూర్తం కుదిరినట్టేనా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!