Liger: ‘లైగర్’ యాటిట్యూడ్ గ్లింప్స్ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే!.. ఛార్మీ కౌర్ (Charmme Kaur) ట్వీట్

Updated on Jul 29, 2022 01:12 AM IST
Liger: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) యాటిట్యూడ్ తెలిపే గ్లింప్స్ టీజర్‌ను మేకర్స్ జూలై 29 ఉద‌యం 9 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు.
Liger: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) యాటిట్యూడ్ తెలిపే గ్లింప్స్ టీజర్‌ను మేకర్స్ జూలై 29 ఉద‌యం 9 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు.

Liger: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న 'లైగ‌ర్' చిత్రం నుంచి మ‌రో అప్‌డేట్ రిలీజ్ అయింది. 'లైగ‌ర్' యాటిట్యూడ్ గ్లింప్స్‌ను జూలై 29న రిలీజ్ చేస్తామంటూ ప్రొడ్యూస‌ర్ ఛార్మీ కౌర్ ట్వీట్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌న్ కలిసున్న ఫోటో ఈ గ్లింప్స్ పై ఆస‌క్తిని మరింత పెంచుతోంది.

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ 'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ 'లైగ‌ర్' సినిమాలో హీరోకి మాస్ట‌ర్‌గా నటిస్తున్నారంటూ చిత్ర యూనిట్ ఇంతకు ముందే ఓ వీడియోను విడుద‌ల చేసింది.
 

లైగ‌ర్ వైఖ‌రిపై వీడియో!

'లైగ‌ర్' సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. పాన్ ఇండియా సినిమాగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న రిలీజ్ కానుంది. భారీ యాక్ష‌న్ సినిమాగా 'లైగ‌ర్' ఓ వండ‌ర్ క్రియేట్ చేస్తుంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రకు ఉండే ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను, అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశాలను తెలిపే గ్లింప్స్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. జూలై 29 తేదిన ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ గ్లింప్స్, సోషల్ మీడియాలో హల్చల్ చేయనుంది. #WaatLagaDenge అనే హాష్ ట్యాగ్‌తో ఈ గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

'లైగ‌ర్‌'లో విజ‌య్ దేవ‌ర‌కొండ నత్తితో బాధపడే ఓ యువ బాక్సర్ పాత్రలో నటించనున్నారు. అలాగే ఓ ట్రైన్డ్ బాక్సర్‌గా ప్రత్యర్థిపై పంచ్‌ల మీద పంచ్‌లు కురిపించనున్నారు. అదేవిధంగా మాస్ యాక్ష‌న్ సీన్ల‌లో కూడా విజ‌య్ అద‌ర‌గొట్ట‌నున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా తన బోల్డ్ ఫోటోల‌ను రిలీజ్ చేసి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచ‌ల‌నంగా మారారు. 

రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌ సినిమా

'లైగ‌ర్' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. 

Read More : 'లైగ‌ర్' కోసం న‌త్తిగా మాట్లాడ‌టం నేర్చుకున్నా.. కామెడీ కూడా : విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!