'లైగర్' కోసం నత్తిగా మాట్లాడటం నేర్చుకున్నా.. కామెడీ కూడా : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అరంగేట్రం చేయనున్నారు. ఓ బాక్సర్ కథగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. విజయ్ దేవరకొండ కూడా 'లైగర్' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను ఈ సినిమాపై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టానని తెలిపారు.
అన్ని సినిమాలు ఒకేసారి చేయలేను : విజయ్
ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని విజయ్ దేవరకొండ అంటున్నారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు. మరో సినిమాలో కూడా నటించడం తన వల్ల కాదంటున్నారు. తాను మల్టీ టాస్కింగ్ మ్యానేజ్ చేయలేనని విజయ్ స్పష్టం చేశారు. తన ఫోకస్ ఎప్పుడూ తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాపైనే ఉంటుందని చెప్పారు. 'లైగర్' పైనే తన దృష్టంతా అని చెప్పకనే చెప్పారు విజయ్.
నత్తిగా మాట్లాడటం నేర్చుకున్నా : రౌడీ హీరో
'లైగర్' సినిమాలో నత్తి ఉన్న యువకుడి పాత్రలో విజయ్ (Vijay Deverakonda) నటించారు. నత్తితో బాధపడుతున్నట్లు నటించాలంటే హీరోకు పెద్ద సవాలే. కానీ విజయ్ అందుకోసం చాలా కష్టపడ్డాడు. సినిమాలో విజయ్ శారీరకంగా చాలా బలమైన వ్యక్తి. ఇతరులను బాక్సింగ్‌తో భయపెట్టగలడు. కానీ విజయ్ తాను ప్రేమించిన అమ్మాయికి 'ఐ లవ్ యూ' అనే మూడు పదాలు చెప్పలేడు. నత్తి ఉండడమే దానికి కారణం. అలాంటి పాత్రలో నటించడం కోసం నిజంగానే తనకు నత్తి ఉన్నట్లు మాట్లాడటం నేర్చుకున్నాడు విజయ్.
మొదట్లో నత్తిగా మాట్లాడడానికి విజయ్ ఎంతో ప్రాక్టీస్ చేశారట. ఆ తర్వాత నెమ్మదిగా అలవాటయిందట. మూడు రోజుల్లోనే నత్తితో మాట్లాడటం సులభం అయిందని విజయ్ తెలిపారు. 'లైగర్' కోసం విజయ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన నటనకు ఉన్న సత్తా ఏంటో ప్రేక్షకులకు చూపించనున్నారు.
లైగర్ కోసం విజయ్ సాహసం
విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా కోసం మరో సాహసం చేశారు. బోల్డ్ ఫోటోలతో 'లైగర్' చిత్ర ప్రమోషన్లు చేశారు.'లైగర్' చిత్రంలో రమ్య కృష్ణన్ విజయ్ అమ్మగా నటించారు. అలాగే అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో వెండితెరపై కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో.. భారీ అంచనాల మధ్య 'లైగర్' సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.