HBD Chiranjeevi : చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. అభిమానులతో పాటు సెలబ్రిటీల శుభాకాంక్షల వెల్లువ

Updated on Aug 22, 2022 12:52 PM IST
Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ చిత్రాలలో నటిస్తున్నారు.
Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ చిత్రాలలో నటిస్తున్నారు.

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ బర్త్ డేని పురస్కరించుకొని ఎందరో సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు అప్లోడ్ చేస్తూ, ఆయనపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఆ ముచ్చట్లేంటో మనమూ ఓ సారి చూసేద్దామా ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్" అంటూ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

అలాగే దర్శకుడు మెహర్ రమేష్ "బాస్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్" అని పేర్కొంటూ, చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెహర్ రమేష్ ప్రస్తుతం చిరుతో "భోళాశంకర్" సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

 

నటుడు సాయిధరమ్ తేజ్ కూడా చిరంజీవి పై తన అభిమానాన్ని చాటుకున్నారు. "మామయ్య... మీరే మాకు ప్రేరణ" అంటూ భావోద్వేగంతో ఓ పోస్టును షేర్ చేశారు. 

సింగర్ స్మిత కూడా మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.  "మీరు ఎప్పటికీ మాలో స్ఫూర్తిని నింపుతూనే ఉండాలి. అలాగే కలకాలం ఆనందంగా ఉండాలి" అంటూ ఓ పోస్టు షేర్ చేశారు. 

సినీ నటుడు సుశాంత్‌ కూడా చిరంజీవిని ఉద్దేశించి, ఓ పోస్టు చేశారు. "మీలోని సానుకూల గుణం మాకు మరింత శక్తిని అందిస్తోంది" అని ఆయన మెగాస్టార్ పై తనకు ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు. 

ఇంకా ఎందరో సెలబ్రిటీలు, అభిమానులు, ఇతర నటీనటుల అభిమానులు కూడా చిరంజీవికి సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలిపారు. 

Read More:  HBD Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!