Waltair Veerayya: ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అంటున్న చిరు, ఊర్వశి!.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Updated on Nov 23, 2022 06:28 PM IST
‘బాస్ పార్టీ’ (Boss Party) పాట చివర్లో ‘అదిరిపోనాది పార్టీ’ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది
‘బాస్ పార్టీ’ (Boss Party) పాట చివర్లో ‘అదిరిపోనాది పార్టీ’ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది

‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కమ్‌బ్యాక్‌లో ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువ పాజిటివ్ టాక్ ఈ మూవీకే వచ్చింది. అందుకే బాక్సాఫీస్ వద్ద ‘గాడ్‌ఫాదర్’ సత్తా చాటింది. దసరా పండుగకు రిలీజైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. అయితే చిరు రేంజ్ హిట్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఓపెనింగ్స్ విషయంలో మెగాస్టార్ గత చిత్రం ‘ఆచార్య’ను ‘గాడ్‌ఫాదర్’ అధిగమించలేకపోయింది. అయితే లాంగ్ రన్‌లో మాత్రం హిట్ స్టేటస్‌ను అందుకుని.. చిరు ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది. 

ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలని మెగాస్టార్ కసి మీద ఉన్నారు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ప్రముఖ దర్శకుడు బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘క్రాక్’ తర్వాత బాబీ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో చిరు (Chiranjeevi)ను మాస్ లుక్‌లో చూపిస్తుండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి.

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)పై వస్తున్న అంచనాలను మరింత పెంచేలా ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్, చిరు ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మాస్ లుక్‌లో, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో చిరంజీవి అదుర్స్ అనిపించారు. దీంతో సినిమాపై ఇంకా హైప్‌ను పెంచేందుకు సాంగ్స్‌ను రిలీజ్ చేయాలని బాబీ అండ్ టీమ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఇవాళ ‘బాస్ పార్టీ’ అనే పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 

‘బాస్ పార్టీ’ పాట క్యాచీ లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది. ‘నువ్వు షర్ట్ ముడేస్కో, కర్చీఫ్ కట్టుకో’ అంటూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇందులో చిరు తన మార్క్ స్టెప్స్‌తో అదరగొట్టారు. ఆయన సరసన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటెలా (Urvashi Rautela) డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పాట చివర్లో ‘అదిరిపోనాది పార్టీ’ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇకపోతే, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చుతున్నారు.  

Read more: జపాన్‌లో కాసులు కురిపించిన టాప్‌-8 భారతీయ సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!