మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) రిలీజ్ డేట్ ఫిక్స్..?

Updated on Nov 11, 2022 01:41 PM IST
తాజాగా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) సినిమా రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) సినిమా రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

'గాడ్ ఫాదర్' తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇపుడు భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం ఓ మెగా కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా.. విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత ఈయన నటించిన ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ పరాజయాలుగా మిగిలాయి. దీంతో ప్రస్తుతం చిరు ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పైనే ఉన్నాయి.

బాబీ (Director Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు ఒకప్పటి నటి సుమలత కూడా నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి యూరప్ వెళ్లనున్నారని తెలుస్తోంది. యూరప్‌లోని మాల్టా దేశంలో 20రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట టీమ్.

తాజాగా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) సినిమా రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’, విజయ్‌ ‘వారసుడు’ సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్‌ కానున్నాయి. దీంతో ఆయా చిత్ర నిర్మాతలు చర్చలు జరిపి ఒకే రోజు సినిమాలు రిలీజ్ కావడం మంచిది కాదని.. ఒకటి, రెండు రోజులు ముందు వెనక్కి జరగాలని నిర్ణయించుకున్నట్లు టాక్‌. దాంతో 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని జనవరి 13కు లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. 

Read More: Megastar Chiranjeevi : చిరు 154 వ సినిమా టైటిల్ ఖరారు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!