కేజీఎఫ్‌2 సినిమాపై బాలీవుడ్ స్టార్ ఆమిర్‌‌ఖాన్ (Aamir Khan) సెన్సేషనల్‌ కామెంట్స్‌..తన సినిమాపై నమ్మకం లేకేనా?

Updated on Jul 29, 2022 01:25 PM IST
కేజీఎఫ్‌2 సినిమా రిలీజ్‌ రోజు తన సినిమా రిలీజ్ చేయకపోవడమే మంచిదైందని బాలీవుడ్ స్టార్ ఆమిర్‌‌ఖాన్  (Aamir Khan) కామెంట్లు
కేజీఎఫ్‌2 సినిమా రిలీజ్‌ రోజు తన సినిమా రిలీజ్ చేయకపోవడమే మంచిదైందని బాలీవుడ్ స్టార్ ఆమిర్‌‌ఖాన్ (Aamir Khan) కామెంట్లు

బాలీవుడ్ హీరోలలో ఎక్కువ హిట్ పర్సంటేజ్ ఉన్న హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). దాదాసు 35 సంవత్సరాల సినీ కెరీర్‌‌లో  35 సినిమాలు కూడా చేయలేదు ఈ స్టార్ హీరో. ఏడాదికి ఒక్క సినిమా, లేదంటే రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటారు ఆమిర్. అయితే ఆ సినిమా మాత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుంది. తను చేసే సినిమాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారాయన.

ప్రస్తుతం ఆమిర్ ఖాన్ లెక్క తప్పుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రేక్షకుల మైండ్ సెట్ మారుతోందని, దానిని అర్థం చేసుకోవడంలో ఆమిర్ ఖాన్ కూడా కాస్త వెనుకబడుతున్నారని చెబుతున్నారు. ఆమిర్‌‌ ఖాన్ గత సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఫలితమే దానిని నిదర్శనం అని అంటున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో దాదాపు నాలుగు సంవత్సరాలుగా మరో సినిమాను రిలీజ్ చేయలేదు ఆమిర్‌‌ ఖాన్. ఇప్పుడు ఆమిర్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలవుతోంది. తెలుగులో చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌‌ తెలుగు రాష్ట్రాల్లో ‘లాల్‌ సింగ్ చడ్డా’ సినిమాను విడుదల చేస్తున్నారు.

 

కేజీఎఫ్‌2 సినిమా రిలీజ్‌ రోజు తన సినిమా రిలీజ్ చేయకపోవడమే మంచిదైందని బాలీవుడ్ స్టార్ ఆమిర్‌‌ఖాన్  (Aamir Khan) కామెంట్లు

రిలీజ్ వాయిదా..

లాల్‌ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్‌ కూడా జోరుగానే సాగుతున్నాయి. అయితే తాజాగా ఆమిర్ ఖాన్ (Aamir Khan) చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్లు లాల్‌ సింగ్ చడ్డా సినిమాపై సినీ ప్రేమికులకు ఆసక్తిని తగ్గించేలా ఉన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్‌ 14వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే అదే రోజున కేజీఎఫ్‌2 సినిమా విడుదలైంది. కేజీఎఫ్‌ పార్ట్‌ 1 సినిమా హిట్‌ కావడంతో ఆ సినిమా సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కేజీఎఫ్‌2 రిలీజ్ అవుతుండడంతో తాను నటించిన లాల్‌ సింగ్ చడ్డా సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు ఆమిర్‌‌ఖాన్. అయితే కేజీఎఫ్‌ సినిమా రిలీజ్‌ సమయానికి తన సినిమా గ్రాఫిక్స్‌ వర్క్ పూర్తికాలేదని, అందుకే విడుదల చేయలేదని అందుకు ఇప్పుడు సంతోషిస్తున్నానని చెప్పారు ఆమిర్. కేజీఎఫ్‌2 సినిమా ముందు తన సినిమా లాల్‌ సింగ్ చడ్డా వాష్‌ ఔట్‌ అయిపోయేదని అన్నారు ఆమిర్. ఈ కామెంట్స్‌ విన్న నెటిజన్లు.. తన సినిమాపై తనకే నమ్మకం లేదా అని సోషల్ మీడియాలో ఆమిర్ ఖాన్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఆమిర్ భయపడ్డారా..

అసలు ఆమిర్‌‌ ఖాన్ సినిమా రిలీజ్ అవుతోందంటేనే బాలీవుడ్‌లో మిగిలిన హీరోలు తమ సినిమాల కలెక్షన్ల గురించి కలవరపడుతూ ఉంటారు. అటువంటిది డబ్బింగ్ సినిమా కేజీఎఫ్‌2 గురించి ఆమిర్‌‌ఖాన్ చేసిన కామెంట్ల చూసి లాల్‌ సింగ్ చడ్డా సినిమాపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.

ఎమోషనల్ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కిన ఆమిర్‌‌ ఖాన్ (Aamir Khan) ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో కమర్షియల్ అంశాలు తక్కువగానే ఉన్నాయి. మరి చిరంజీవి సమర్సణలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి.

Read More : మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi ) థ్యాంక్స్ చెబుతూ బాలీవుడ్‌ స్టార్ అమీర్‌‌ ఖాన్ ట్వీట్.. వైరల్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!