Devisri Prasad : దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సల్మాన్ ఖాన్‌కు ఎందుకు నచ్చలేదు? కారణం ఏమై ఉంటుంది?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కభీ ఈద్ కభీ దివాళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ను తొలుత సెలెక్ట్ చేశారు. కానీ సల్మాన్ ఖాన్ దేవిశ్రీ ప్రసాద్‌ను ఈ సినిమా నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి. అసలు సల్మాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అసలేం జరిగిందో మనమూ తెలుసుకుందాం.. !
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. 'పుష్ప' సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇండియా మొత్తం మారు మోగింది. ఆ మ్యూజిక్‌ను విన్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన సినిమా 'కభీ ఈద్ కభీ దివాళి'లో పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. దేవిశ్రీ ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేశారు. అయితే, అవేవీ సల్మాన్ ఖాన్‌కు నచ్చలేదట. దీంతో దేవిశ్రీ ప్రసాద్‌ను సినిమా నుంచి తొలగించారని వార్తలు వచ్చాయి.
మ్యూజిక్ నచ్చకే తొలిగించారా?
సల్మాన్ ఖాన్ (Salman Khan) కభీ ఈద్ కభీ దివాళి చిత్రానికి సంబంధించిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవడం లేదట. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి దేవీశ్రీని తప్పించి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ని ఎంపిక చేశారట. రవి బస్రూర్ అందించిన టైటిల్ ట్రాక్ సల్మాన్‌కు నచ్చడంతో తన సినిమాలో అవకాశం ఇచ్చారు. గతంలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటల ట్యూన్స్‌ను సల్మాన్ ఖాన్ తన సినిమాల్లో వాడారు. రింగా రింగా, సిటీ మార్ సాంగ్స్ ట్యూన్స్‌ను సల్మాన్ తన సినిమాల్లో వాడుకున్న సంగతి తెలిసిందే.
కభీ ఈద్ కభీ దివాళి మూవీకి దర్శకుడిగా ఫర్హాద్ సామ్జీ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, కృతి సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ సాంగ్‌లో రామ్ చరణ్ కూడా కనిపించనున్నారట. ఇక సల్మాన్ ఖాన్ (Salman Khan) చిరంజీవి సినిమా 'గాడ్ ఫాదర్ 'లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారట.
టాలీవుడ్ దర్శకులు దూరం పెడుతున్నారా?
దర్శకులు కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ సినిమాల్లో దేవిశ్రీ ప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేసుకునే వారు. ఆ తర్వాత వీరు తమ సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చేశారు. సుకుమార్ మాత్రం తన సినిమాల్లో దేవిశ్రీ ప్రసాద్‌కు అవకాశం కల్పిస్తూనే ఉన్నారు. ఏదేమైనా, బాలీవుడ్‌లో దేవిశ్రీ ప్రసాద్‌కు జరిగిన అవమానంపై అతని అభిమానులు మండిపడుతున్నారు.