తొలిసారి కమర్షియల్ యాడ్ లో నటించి అలరించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వీడియో వైరల్!

Updated on Oct 28, 2022 11:38 AM IST
బాలకృష్ణ తొలిసారిగా ఒక కమర్షియల్ యాడ్ (Balakrishna in Commercial Ad) లో కనిపించారు.
బాలకృష్ణ తొలిసారిగా ఒక కమర్షియల్ యాడ్ (Balakrishna in Commercial Ad) లో కనిపించారు.

టాలీవుడ్‌ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌ మెంట్‌ అందించేందుకు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న మూవీ 'వీరసింహారెడ్డి'. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే.. బాలకృష్ణ తొలిసారిగా ఒక కమర్షియల్ యాడ్ (Balakrishna in Commercial Ad) లో కనిపించారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు గడించిన సాయి ప్రియా గ్రూప్ వారి తాజా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ '116 పారమౌంట్' (116 Paramount) వారి యాడ్ లో నటించారు బాలకృష్ణ. సినిమాటిక్‌ స్టైల్‌లో '116 పారామౌంట్‌' వెంచర్‌ ను ప్రమోట్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. 

కాగా, ఈ యాడ్ ఎంతో రాయల్ గా.. రిచ్ లుక్ తో ఉంది. ఈ యాడ్ లో రోల్స్ రాయిస్ కార్ కనిపిస్తోంది. ఈ కారు నంబర్ ప్లేట్ పై 'ఎన్బీకే1' అని రాసి ఉంది. ఒక యాడ్ లో కుర్తా, సూట్ లో అదరగొట్టే స్టైలిష్ లుక్ లో ఒక యాడ్ లో కనిపించిన బాలకృష్ణ, మరొక యాడ్ లో పక్కా మిడిల్ క్లాస్ వ్యక్తి గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ రెండు యాడ్స్ కి సురేష్ సారంగం కెమెరా మ్యాన్ గా వ్యవహరించగా, యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.

అయితే, ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నడు ఏ కమర్షియల్ యాడ్ చేయని బాలయ్య (Nandamuri Balakrishna) ఇపుడు బ్రాండింగ్‌లో దిగడం నిజంగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అనే చెప్పాలి. తన తోటి హీరోల్లో చాలా మంది సినిమాల్లో వచ్చిన ఇమేజ్‌‌తో వాణిజ్య ప్రకటనల్లో నటించారు. కానీ బాలయ్య మాత్రం ఇంత వరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్‌లో నటించలేదు. 

ఇక, ఇప్పటికే ఆహా టాక్ షో అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 1, అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2లతో (Unstoppable Season 2) అభిమానులకు వినోదాన్ని పంచుతూ ఓటీటీ ప్రపంచంలో తనదైన మార్కును క్రియేట్‌ చేస్తున్న బాలకృష్ణ.. తొలిసారి కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ యాడ్‌లో కూడా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read More: టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిన్న కూతురు నందమూరి తేజస్విని (Tejaswini)..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!