Tiger Nageswara Rao : రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో.. అనుపమ్ ఖేర్‌కు కీలక పాత్ర !

Updated on Aug 06, 2022 02:25 PM IST
ఈ మధ్యకాలంలో అనుపమ్ ఖేర్ (Anupam Kher) దక్షిణాది చిత్రాలలో కూడా నటించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అనుపమ్ ఖేర్ (Anupam Kher) దక్షిణాది చిత్రాలలో కూడా నటించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రాలలో కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో ఈయన ఓ కీలక పాత్రను పోషించేందుకు అంగీకరించారు. ఇటీవలే ఆయన లుక్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

అనుపమ్ ఖేర్ (Anupam Kher)  హిందీలో కొన్ని వందల సినిమాలు చేశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆయన సుపరిచితులు. సారాంశ్, విజయ్, రామ్ లఖన్, డాడీ, ఖేల్, డర్, వెడ్‌నెస్ డే లాంటి సినిమాలు అనుపమ్ ఖేర్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇటీవలే అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్‌’లో కూడా ఖేర్ నటించారు.

‘ది కశ్మీరీ ఫైల్స్‌’ చిత్రంతో అనుపమ్‌కు దేశవ్యాప్తంగా పేరు

‘ది కశ్మీరీ ఫైల్స్‌’ సినిమాలో అనుపమ్‌ (Anupam Kher)  పోషించిన పుష్కర్‌ నాథ్‌ పండిట్‌ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ అభిషేక్‌ నిర్మిస్తున్న సినిమాకి తాను పనిచేయడం పట్ల అనుపమ్‌ తన ఆనందం వ్యక్తం చేశారు. స్టువర్ట్‌పురం దొంగగా పేరు గాంచిన ఓ క్రిమినల్ బయోపిక్‌గా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం తెరకెక్కనుంది. 1970 ప్రాంతం నాటి కథా నేపథ్యం గల ఈ చిత్రంలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 

5 భాషలలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’

జివి ప్రకాష్ కుమార్ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా, శ్రీకాంత్ సంభాషణలు వ్రాస్తున్నారు. అలాగే అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనరుగా వ్యవహరిస్తున్నారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ కూడా ఈ సినిమాలో కొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. 

గతంలో తెలుగులో దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ (Vamsee) ‘టైగర్‌ నాగేశ్వరరావు’  సినిమాని కూడా డైరెక్ట్ చేయనున్నారు. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం తెలుగులో ‘కార్తికేయ 2’ అనే చిత్రంలో కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. 

Read More: హీరోగా రవితేజ (Ravi Teja) తమ్ముడి కొడుకు ఎంట్రీ.. దర్శకుడు రమేష్‌ వర్మపైనే భారం వేసిన మాస్‌ మహరాజా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!