రవితేజ (Ravi Teja) చెల్లెలిగా జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా?.. వైరల్ అవుతున్న న్యూస్‌

Updated on Jun 05, 2022 11:23 PM IST
రవితేజ (Ravi Teja), ఫరియా అబ్దుల్లా
రవితేజ (Ravi Teja), ఫరియా అబ్దుల్లా

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో ర‌వితేజ (Ravi Teja). త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వం చేస్తున్న ధ‌మాకా ఒక‌టి. ఈ సినిమాలో ‘పెళ్లి సంద‌D’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా, జాతిర‌త్నాలు సినిమాతో ఫేమస్‌ అయిన ఫ‌రియా అబ్దుల్లా కూడా నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఫిమేల్ లీడ్ రోల్‌లో ఫరియా మెరవనుందని టాక్‌. ఈ సినిమాపై అనేక వార్తలు ఇండస్ట్రీలోనూ, సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా గురించి తాజాగా బయటకు వచ్చిన వార్త వైరల్ అవుతోంది.

ధమాకా సినిమాలో హీరో ర‌వితేజకు చెల్లెలిగా ఫ‌రియా నటిస్తోందనే వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్‌ మాత్రమే. ఎటువంటి అధికారిక ప్రకటన చిత్ర యూనిట్‌ నుంచి రాలేదు. అయితే ధమాకా సినిమాలో రవితేజకు చెల్లెలిగా ఫరియా నటిస్తుందనే వార్తలు, ఫిమేల్‌ లీడ్‌ రోల్‌ అనే విషయాలను గమనిస్తుంటే సినిమాలో సిస్టర్ సెంటిమెంట్‌ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ అప్‌డేట్ సంగతి ఎలా ఉన్నా.. సినిమా స్క్రీన్‌పై ర‌వితేజ‌, -ఫ‌రియా అన్నాచెల్లెళ్లుగా ప్రేక్షకులను ఎలా ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నార‌నే చర్చ ఇప్పటికే మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చర్స్ బ్యాన‌ర్లపై అభిషేక్ అగర్వాల్‌, వివేక్ కూచిబొట్ల ధమాకా సినిమాను నిర్మిస్తున్నారు.

రవితేజ (Ravi Teja) థమాకా సినిమా పోస్టర్

ఇక, ర‌వితేజ కొత్త డైరెక్టర్ శ‌ర‌త్ మండ‌వతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు సుధీర్ వ‌ర్మ తీస్తున్న ‘రావ‌ణాసుర’లో టైగర్‌‌ నాగేశ్వరరావు సినిమాల్లో నటిస్తున్నాడు రవితేజ. తొలి పాన్ ఇండియా ప్రాజెక్టుగా ‘టైగ‌ర్ నాగేశ్వర్ రావు’ సినిమాతో నార్తిండియా ప్రేక్షకుల‌ను కూడా అలరించడానికి సిద్ధమవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja).

Read More: మ‌రోసారి వాయిదాప‌డ్డ ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ఆ గొడ‌వ‌లే కార‌ణ‌మా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!