పూనకాలు లోడింగ్.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్ చిరు (Chiranjeevi Konidela)

Updated on Oct 27, 2022 04:21 PM IST
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా మాస్ లుక్‌లో చిరంజీవి (Chiranjeevi Konidela) గెటప్ చూస్తుంటే ఆయన అభిమానులకు ట్రీట్ అనేలా ఉంది
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా మాస్ లుక్‌లో చిరంజీవి (Chiranjeevi Konidela) గెటప్ చూస్తుంటే ఆయన అభిమానులకు ట్రీట్ అనేలా ఉంది

మెగాస్టార్ (Chiranjeevi Konidela) అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి సినిమాల నుంచి నెక్స్ట్ ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు యంగ్ డైరెక్టర్ బాబీ (Bobby) దీపావళి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రం టైటిల్‌ను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ‘వాల్లేరు వీరయ్య’ (Waltair Veerayya)గా తెరకెక్కతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మాస్‌కు కేరాఫ్‌గా చెప్పుకునే మెగాస్టార్ ఇమేజ్‌ను రెట్టింపు చేసే విధంగా ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్ ఉందని ప్రశంసలు వస్తున్నాయి.

టీజర్ విషయానికొస్తే.. ‘మీ అన్నయ్య వస్తే ఏదో అయిపోతుందని అన్నారు. ఎక్కడ్రా’ అని విలన్ అంటుంటాడు. వెంటనే హార్బర్‌లో బాంబుల మోత.. తీరా ఎవరని చూస్తే అక్కడ స్టైల్‌గా బీడీ తాగుతున్న మెగాస్టార్.. ‘వాల్తేరు వీరయ్య’గా కనిపించారు. మరింత ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేయండంటూ టీజర్ చివర్లో చిరంజీవి చెప్పిన డైలాగ్ పీక్స్‌లో ఉంది.

‘వాల్తేరు వీరయ్య’గా ఫుల్ మాస్ లుక్‌లో చిరంజీవి దర్శనమివ్వడాన్ని టీజర్‌లో చూడొచ్చు. ఈ లుక్, టీజర్ చూస్తుంటే అభిమానుల కోసం పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి. టీజర్‌లో విజువల్స్‌తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చుతున్నారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో చిరు తమ్ముడిగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై ఉన్న అనుమానాలను మూవీ యూనిట్ పటాపంచలు చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను భారీ లెవల్లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు టీజర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ప్రభాస్ ‘ఆదిపురుష్’, తమిళ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’ కూడా పొంగల్ బరిలో దిగుతుండటంతో మూడు సినిమాల మధ్య తీవ్ర పోటీ తప్పేలా లేదు. 

Read more: ‘ఆటో జానీ’ కథ ఏమైంది?.. ఆసక్తికరంగా చిరు (Chiranjeevi Konidela), పూరి (Puri Jagannadh) ఇంటర్వ్యూ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!