జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల శివ సినిమాలో హీరోయిన్లుగా అనన్య పాండే, సాయి పల్లవి !

Updated on Jul 25, 2022 06:54 PM IST
ఎన్టీఆర్‌‌ 30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల కాంబో సినిమా షూటింగ్ సెప్టెంబర్‌‌లో
ఎన్టీఆర్‌‌ 30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల కాంబో సినిమా షూటింగ్ సెప్టెంబర్‌‌లో

జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR) ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. సెప్టెంబర్‌‌ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని, రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో ఆయన కనిపించనున్నారని సమాచారం.

ఇక, ఎన్టీఆర్‌‌ – కొరటాల కాంబినేషన్‌ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై పలు వార్తలు ఆన్ లైన్‌లో హల్చల్ చేస్తున్నాయి.  ఈ సినిమాలో ఎన్టీఆర్‌‌తో రొమాన్స్‌ చేసే హీరోయిన్లకు సంబంధించి చాలామంది పేర్లే వినిపించినా.. ఎట్టకేలకు ఆ లక్కీ ఛాన్స్ కొట్టే కథానాయిక ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసింది.

విజయ్‌ దేవరకొండ సరసన 'లైగర్‌‌ ' సినిమాలో నటించిన అనన్య పాండేను ఎన్టీఆర్‌‌కు హీరోయిన్‌గా ఫైనల్ చేశారు దర్శకుడు కొరటాల. ఈ సినిమాలో అనన్యతోపాటు మరో హీరోయిన్‌ కూడా నటించనున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌‌ 30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల కాంబో సినిమాలో హీరోయిన్లుగా అనన్య, సాయిపల్లవి

రొమాంటిక్ సీన్స్..

అనన్య పాండేకి, జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR) కు మధ్య ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. ఇక, మెగాస్టార్‌‌ చిరంజీవి, మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందన్న సంగతి తెలిసిందే.

ఆ సినిమా ఫలితంతో ఎన్టీఆర్‌‌ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట నిర్మాతలు. అందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకుని మరీ ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో అనన్యతోపాటు ఎన్టీఆర్‌‌తో ఆడిపాడేందుకు సాయిపల్లవిని కూడా ఎంపిక చేయనున్నారట. 

భారీ బడ్జెట్‌..

ఎన్టీఆర్‌‌ – కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా కోసం నిర్మాతలు దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. హాలీవుడ్  టెక్నీషియన్స్‌తో యాక్షన్ విజువల్స్‌ను డిజైన్ చేయిస్తున్నారట.

అంతేకాకుండా.. ఈ ఎన్టీఆర్‌‌ (Junior NTR) సినిమా ద్వారా ఓ కొత్త సందేశాన్ని కూడా ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నారట.. సుధాకర్ మిక్కిలినేని, కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Read More : రవితేజకు (Ravi Teja) చిరంజీవి స్ఫూర్తి నాకు రవితేజ స్ఫూర్తి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్​లో నాని (Nani)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!