జూనియర్ ఎన్టీఆర్ (NTR), మహేష్‌బాబు (MaheshBabu)పై దర్శకుడు కృష్ణవంశీ కామెంట్లు.. నటనలో వీరిద్దరూ ఈక్వల్‌ అని వెల్లడి

Updated on Jul 21, 2022 01:45 AM IST
కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో చాలాకాలం నుంచి తెరకెక్కిస్తున్న 'రంగమార్తాండ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది.
కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో చాలాకాలం నుంచి తెరకెక్కిస్తున్న 'రంగమార్తాండ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది.

జూనియర్ ఎన్టీఆర్ (NTR), మహేష్‌బాబు (MaheshBabu) స్టార్ కిడ్స్‌ అయినా.. కష్టపడి మరింత మంచి పేరు తెచ్చుకున్న హీరోలు. కోట్లాది మంది అభిమానులను తమ నటనతో అలరిస్తున్నారు. నటనలోనూ, కథల ఎంపికలోనూ వైవిధ్యం కనబరుస్తూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. వీళ్లు నటించిన సినిమా రిలీజ్ అవుతోందంటే ఫ్యాన్స్‌కు పండుగే.

తాజాగా మహేష్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్‌‌, రాంచరణ్‌ కలిసి నటించిన సూపర్‌‌ డూపర్ హిట్ సినిమా ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌'. 

పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైన 'ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌' సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలకొట్టి వసూళ్ల సునామీ సృష్టించింది. సముద్రం, మురారి, చందమామ, గోవిందుడు అందరి వాడేలే సినిమాలతో స్టార్‌‌ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఈ మధ్య ఆయన రేంజ్ హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. 

కృష్ణవంశీ  దర్శకత్వంలో చాలాకాలం నుంచి తెరకెక్కిస్తున్న 'రంగమార్తాండ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలే విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో కృష్ణవంశీ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు.

దర్శకులపై కూడా..
టాలీవుడ్‌లో నటనకు రూపం అంటే జూనియర్ ఎన్టీఆర్‌‌ అని, ఆయనతో సమానంగా మహేష్‌బాబు కూడా నటిస్తారని కృష్ణవంశీ అన్నారు. కృష్ణవంశీ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే, దర్శకత్వం చేయాలనుకునే వాళ్లు కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలపాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌గా చేస్తే బాగుంటుందని కూడా కామెంట్లు చేశారు కృష్ణవంశీ. 

అయితే, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే డైరెక్టర్లు కొత్త ఆలోచనలతో కొత్త కథలతో వస్తున్నారని, అది శుభ పరిణామమని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌‌తో (NTR) కృష్ణవంశీ.. 'రాఖీ' అనే సినిమాను తెరకెక్కించారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అలాగే మహేష్‌బాబుతో (MaheshBabu)  'మురా'రి సినిమా తీశారు కృష్ణవంశీ. 'మురారి' సినిమాతో మహేష్‌ కెరీర్‌‌ టర్న్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఇక, 'రంగమార్తాండ' సినిమా తర్వాత కృష్ణవంశీ ‘అన్నం’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు.

Read More: త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi).. రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!