ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల శివ కాంబో సినిమా షూటింగ్ స్టార్ట్ కాలే.. సెప్టెంబర్‌‌లో మొదలయ్యే చాన్స్?

Updated on Jul 10, 2022 09:08 PM IST
జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ (NTR), కొరటాల శివ
జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ (NTR), కొరటాల శివ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR), రాంచరణ్‌ హీరోలుగా నటించిన బ్లాక్‌బస్టర్ మల్టీస్టారర్‌‌ సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. పాన్‌ ఇండియా సినిమాగా రిలీజైన ఈ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. వసూళ్ల సునామీ సృష్టించింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా కోసం ఎన్టీఆర్, రాంచరణ్‌ కూడా మూడేళ్లు కేటాయించారు.

ఈ మూడు సంవత్సరాల్లో రాంచరణ్‌ ఆచార్య సినిమా కోసం కొన్ని రోజులు కేటాయించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కాదు కదా.. మరో సినిమా కథను ఓకే చేసి లైన్‌లో కూడా పెట్టలేదు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక, ఎన్టీఆర్‌‌ తదుపరి సినిమాపైనే ఫ్యాన్స్‌ దృష్టి పడింది.

జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ (NTR) కొత్త సినిమా పోస్టర్

షూటింగ్ స్టార్ట్ కాలే..

ఎన్టీఆర్‌‌ (Junior NTR).. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత సినిమా కొరటాల శివతో చేయనున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌‌పై మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్‌‌ 30 సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్‌‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని హింట్ ఇచ్చేశారు కొరటాల. జూన్ నెలలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు.
జూన్‌లో కాదు కదా జూలైలో కూడా ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఇక ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. ఇక అది కూడా సాధ్యమయ్యేలా లేదని తెలుస్తోంది.

ఫిట్‌ కావడానికేనా..
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా కోసం ఎన్టీఆర్‌‌ కొంచెం బొద్దుగా మారారు ఎన్టీఆర్. కొరటాల సినిమా కోసం స్లిమ్‌గా,  ఫిట్‌గా తయారు కావాల్సి ఉందట. దీనికోసం వర్క్‌ అవుట్‌లు స్టార్ట్‌ చేశారట ఎన్టీఆర్.. ప్రత్యేకంగా ట్రైనర్‌‌ను పెట్టుకుని మరీ ఎన్టీఆర్‌‌ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక, సినిమాకు ఫైనల్ స్క్రిప్ట్  లాక్ కాకపోవడం కూడా కొరటాల షూటింగ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా రిజల్ట్‌ కూడా ఎన్టీఆర్‌‌ సినిమా స్క్రిప్ట్‌ ఫైనల్‌ కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఆచార్య సినిమా అనుకున్న స్ధాయిలో విజయం సాధించకపోవడంతో ఎన్టీఆర్‌‌ సినిమా కథపై మరింతగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారట కొరటాల. స్క్రిప్ట్‌ వర్క్‌పై పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని కొరటాల అనుకుంటున్నారని టాక్. దాంతో ఎన్టీఆర్‌ (Junior NTR)‌ 30 సినిమా షూటింగ్ సెప్టెంబర్‌‌కు మారిందని తెలుస్తోంది. 

Read More : కమల్‌హాసన్ (Kamal Haasan) 'విక్రమ్‌' సినిమా మేకింగ్ వీడియోకి కూడా తగ్గని క్రేజ్.. వీడియో వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!