పులులు అంటే నాకు చాలా ఇష్టం.. మా ఇంట్లో ఒక టైగర్‌ను పెంచుకోవాలనుకుంటున్నా: జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)

Updated on Nov 08, 2022 12:41 PM IST
పులులకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెసుకోవడానికి తాను ఆసక్తి చూపుతానని తారక్ (Junior NTR) అన్నారు. టైగర్స్ నడిచే విధానం బాగుంటుందన్నారు.
పులులకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెసుకోవడానికి తాను ఆసక్తి చూపుతానని తారక్ (Junior NTR) అన్నారు. టైగర్స్ నడిచే విధానం బాగుంటుందన్నారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఒక్కో సినిమాతో తన రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రంతో తన క్రేజ్‌ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లారు తారక్. దేశీ ప్రేక్షకులతోపాటు విదేశీ ఆడియెన్స్ కూడా ఆయన నటనకు ఫిదా అవుతున్నారు. కొమురం భీమ్‌గా తన పాత్రలో అమాయకత్వాన్ని, రౌద్ర రసాన్ని సమపాళ్లలో ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పు పొందడంలో నూటిని నూరుశాతం సఫలమయ్యారు. 

జూనియర్ ఎన్టీఆర్‌ను అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. విభిన్న క్యారెక్టర్లలో తనదైన మార్క్ నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న ఆయన.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరో మర్చిపోలేని హిట్ కొట్టారు. ఈ మూవీలో ఒక సన్నివేశం మాత్రం ఆడియెన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమా ప్రారంభంలో అడవిలో పెద్దపులితో తారక్ ఫైట్ చేసే సీన్ ఆయన ఫ్యాన్స్‌కు కన్నులవిందు చేసింది. 

ఇకపోతే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు పులులు అంటే చాలా ఇష్టం అని చెప్పడం గమనార్హం. ‘నాకు టైగర్స్ ఉంటే చాలా ఇష్టం. అవి నడిచే విధానం ఇంకా బాగా ఇష్టం. వాటి గురించి ప్రతి విషయంపై నాకు ఆసక్తి ఎక్కువ. ఒక పులిని మా ఇంట్లో పెంచుకోవాలని కూడా అనుకుంటున్నా’ అంటూ తారక్ నవ్వేశారు. ఒకవేళ తాను ఏదైనా జంతువుగా మారాలని అనుకుంటే పులిలా మారతానని ఎన్టీఆర్ అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ఓ చిత్రానికి తారక్ కమిటయ్యారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ఈ సినిమాపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మూవీ టీమ్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కెమెరామేన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌తో కొరటాల చర్చిస్తూ కనిపించారు. దీంతో ఈ ఫిల్మ్ త్వరలో పట్టాలెక్కనుందని క్లారిటీ వచ్చేసింది. 

Read more: అనుష్క (Anushka) తర్వాతి సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. 'అన్విత రవళి శెట్టి' గా షెఫ్ పాత్రలో స్వీటీ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!