7YearsForBaahubaliPride: 'బాహుబలి - ద బిగినింగ్'! తెలుగు సినిమా గౌరవాన్ని పెంచిన ప్రభాస్ (Prabhas), రాజమౌళి
7YearsForBaahubaliPride :ఏడేళ్ల క్రితం ఇదే రోజున 'బాహుబలి - ద బిగినింగ్' థియేటర్లలో రిలీజ్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా బాహుబలి విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నెగటివ్ టాక్ నుంచి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఏడేళ్ల క్రితం మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా బాహుబలి నిలిచింది. 'బాహుబలి' ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ఎలా అయింది?. 'బాహుబలి - ద బిగినింగ్' సినిమాపై స్పెషల్ స్టోరి.
1.ప్రభాస్‌కు టర్నింగ్ పాయింట్
'బాహుబలి' చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ప్రభాస్ నటనకు ఇండియాతో పాటు విదేశీయులు ఫిదా అయ్యారు. జనవరి, 2013లో బాహుబలి ప్రభాస్ అంటూ చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి ప్రభాస్‌కు ఫాలోయింగ్ మరింత పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియాలోనే నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) మూడేళ్లు నటించారు.
2.దర్శక ధీరుడు
రాజమౌళి ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇండియాలో భారీ కలెక్షన్ల సినిమాలను దర్శకుడిగా రాజమౌళి పాపులర్ అయ్యారు. 'బాహుబలి-ద బిగినింగ్'కి జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వచ్చాయి. బీబీసీలో వందేళ్ల ఇండియన్ సినిమా డాక్యూమెంటరీలో రాజమౌళి దర్శకత్వం గురించి ప్రస్తావించారు. ప్రపంచ సినిమా వేడుకలైన 'కేన్స్ ఫెస్టివల్'లో రాజమౌళి ఫోటోను ఏర్పాటు చేశారు.
3.బాహుబలి కథ
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి-ద బిగినింగ్' కథను రాశారు. చందమామ పత్రికలో కొన్ని దశాబ్దాల పాటు అనేకానేక జానపద నవలలు వచ్చాయి. వీటిని అందించిన రచయిత గిన్నెస్ రికార్డు సాధించారు. చందమామ నవల స్పూర్తితో జానపద కథగా 'బాహుబలి' కథ రచించారు. దేశ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన విజయేంద్ర ప్రసాద్‌ను భారత ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.
4.కిలికిలి భాష
భారతదేశంలో మొదటిసారి సినిమా కోసం భాషను రూపొందించిన చిత్రంగా 'బాహుబలి' రికార్డుకెక్కింది. కిలికి అనే భాష పేరుతో ఓ కొత్త భాషను కాలకేయుల తెగ కోసం రూపొందించారు. తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” అనే పేరుతో ఓ కొత్త ప్రయోగం చేశారు.
5.నటీ నటులకు పాఠాలు
ప్రభాస్ ఈ సినిమా కోసం కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. అనుష్కకు కత్తిసాము నేర్పించారు. రానాకు గుర్రపు స్వారీ నేర్పించారు.
6.భారీ బడ్జెట్ సినిమా
అత్యంత భారీ బడ్జెట్‌తో 'బాహుబలి-ద బిగినింగ్' సినిమాను నిర్మించారు. ఈ సినిమాను రూ. 180 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. జానపద కథా నేపథ్యం ఉన్న సినిమాను 'ఆర్కా మీడియా వర్క్స్' బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో 2015 జూలై 10 ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి-ద బిగినింగ్' రిలీజ్ అయింది.
7. ఓ యజ్ఞంలా సాగిన సినిమా
బాహుబలి ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేసిన సినిమాగా ఖ్యాతి దక్కించుకుంది 'బాహుబలి-ద బిగినింగ్'.
జాతీయ అవార్డు గ్రహీత వి.శ్రీనివాస్ మోహన్‌కు 'బాహుబలి-ద బిగినింగ్'కి విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు అప్పగించారు. మకుట VFX గ్రాఫిక్స్ డిజైన్ కంపెనీ 'బాహుబలి-ద బిగినింగ్'కి అద్భుతమైన విజువవ్ ఎఫెక్ట్స్ అందించింది. మాహిష్మతి సామ్రాజ్యం, దేవాలయాలు, 1500 అడుగుల జలపాతంతో పాటు పలు ప్రకృతి దృశ్యాలు, యుద్ధాలకు సంబంధించిన విజువల్స్‌ను ఈ కంపెనీ ఓ రేంజ్‌లో క్రియేట్ చేసింది. రెండేళ్ల సుదీర్ఘ సమయం శ్రమించి ఈ చిత్రాన్ని అందించారు.
8. సినిమా ప్రచారం
దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా ప్రచారం కొత్తగా మొదలు పెట్టారు. నటీనటుల పుట్టిన రోజున లేదా.. ఏదైనా ఇతర సందర్భాలలో 'బాహుబలి-ద బిగినింగ్'కి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేసేవారు. సినిమా ప్రచారం చేయడం రాజమౌళికి తెలిసినంత మరెవరికి తెలియదనే టాక్ ఇప్పటికీ వినిపిస్తునే ఉంది. మూవీ ప్రమోషన్ల స్పెషలిస్ట్‌గా రాజమౌళి అగ్ర స్థానంలో ఉన్నారు.
9. వివాదం
తమిళ వెర్షన్‌లో ’పగడై’ (జూదగాడు) అనే పదాన్ని చేర్చడంపై వ్యతిరేకత వచ్చింది.. ఈ చిత్రానికి వ్యతిరేకంగా దళిత సమూహం 'పురచ్చి పులికల్ ఇయక్కం' నిరసన వ్యక్తం చేశారు. తమిళ వెర్షన్ డైలాగ్ రచయిత మాధన్ కార్కీ క్షమాపణలు కోరడంతో వివాదం ముగిసింది.
10. బాక్సాఫీస్ కలెక్షన్
'బాహుబలి-ద బిగినింగ్' రిలీజ్ అయిన మొదటి రోజు రూ. 75 కోట్లను వసూళ్లు చేసింది. వారంలో రూ.165 కోట్లను వసూళ్లు చేసిన ఇండియన్ సినిమాగా ప్రపంచ స్థాయిలో నాల్గో స్థానంలో నిలిచింది. దాదాపు రూ. 650 కోట్లను వసూళ్లు చేసి బాహుబలి భారతీయ సినిమా చరిత్రలో రికార్డు సృష్టించింది.