Acharya: ఆచార్య డిస్టిబ్యూటర్లను ఆదుకుంటున్న దర్శకహీరోలు
Acharya: ఆచార్య సినిమా చిరంజీవికి డిజాస్టర్‌గా మిగిలింది. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva), హీరో చిరంజీవి ఆచార్య డిస్టిబ్యూటర్లను ఆదుకునేలా ప్లాన్ చేశారు. రెమ్యునరేషన్ వద్దంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నారు.
ఆచార్య సినిమా మోగాస్టార్ చిరంజీవికి, రామ్ చరణ్‌లకు ప్లాప్ సినిమాగా మిగిలింది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆచార్య సినిమాకు లాభాల్లో నుంచి వాటా తీసుకుంటానని చిరంజీవి (Chiranjeevi) చెప్పారట. అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆచార్యతో నష్టపోయాం ఆదుకోవాలంటూ చిరంజీవిని కోరారు. డిస్ట్రిబ్యూటర్లను సేవ్ చేసేందుకు చిరంజీవి తన రెమ్యునరేషన్ నుంచి పది కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.
కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో హై రేంజ్ ఎక్పర్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అవడంతో అందుకు బాధ్యత కూడా కొరటాల శివానే తీసుకున్నారు. తన వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆచార్య లెక్కలేంటి?
నైజాం - రూ.12.45 కోట్లు
సీడెడ్- రూ.6.21కోట్లు
ఉత్తరాంధ్ర- రూ.4.85 కోట్లు
తూర్పు- రూ.3.24 కోట్లు
పశ్చిమ- రూ.3.40 కోట్లు
గుంటూరు- రూ. 4.59 కోట్లు
కృష్ణ- రూ. 3.09 కోట్లు
నెల్లూరు- రూ.2.94 కోట్లు
ఏపీ తెలంగాణ మొత్తం - రూ.59.85 కోట్లు
ఇతర రాష్ట్రాల్లో వసూళ్లు - రూ. 2.80 కోట్లు
ఓవర్సీస్ - రూ. 4.78కోట్లు
వరల్డ్ వైడ్ మొత్తం - రూ.76.00 కోట్లు
ఆచార్య సినిమా తీయడానికి రూ.140 కోట్లను ఖర్చుచేశారు. కానీ రూ.76 కోట్ల బిజినెస్ మాత్రమే ఈసినిమా చేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో నష్టపోయారు. కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాడానికి రూ.25 కోట్లు ఇవ్వనున్నారు. ఆచార్య సినిమాకు చిరంజీవి తీసుకుంటున్న రెమ్యునేషన్ రూ.40 కోట్లు, రామ్ చరణ్‌కు రూ.30 కోట్లు అట.చిరంజీవి కూడా తన వంతు సాయంగా రూ.10 కోట్లు ఇస్తున్నారట.
ఓవర్సీస్‌లో లాభాలు భారీ బడ్జెట్ సినిమాలను ఆదుకుంటాయి. డాలర్లలో వసూళ్లు బడ్జెట్ తిరిగి రాబట్టేలా చేస్తుంది. కానీ ఆచార్య ఇతర దేశాల్లో ఆడలేకపోయింది. ఎడిటింగ్, రామ్ చరణ్ క్యారెక్టర్‌ను చంపేయడం.. ఇలా ఎన్నో అంశాలు అమెరికాలోని తెలుగు ఎన్నారైలను మెప్పించలేకపోయింది. మొదట కాజల్ చిరంజీవికి హీరోయిన్ అనుకుని.. సినిమా నుంచి తొలగించారు కొరటాల శివ. చిరంజీవికి హీరోయిన్ లేకపోవడం ఓ మైనస్. నక్సలిజం, హిందూ మతం రెండు కలిపి సినిమాలో చూపించడం కూడా ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లకుండా చేసింది. ఫైనల్‌గా ఆచార్య నెగెటీవ్ టాక్‌తో ప్లాప్ లిస్టులో చేరింది.
కొరటాల శివ, చిరంజీవి ఆచార్య డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే నిర్ణయం ప్రొడ్యూసర్లు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆచార్య (Acharya) ఓటీటీ బిజినెస్ కూడా బాగుంటే ఆచార్య నష్టాల్లోంచి ప్రొడ్యూసర్లు బయటపడినట్లే. ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా సేవ్ అయినట్టే.