సోనూసూద్(Sonu Sood) క్రేజ్ వేరే లెవ‌ల్

Updated on May 01, 2022 05:58 PM IST
Sonu Sood:ఆచార్య సినిమాలో న‌టించిన‌ సోనూసూద్ కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. విల‌న్‌గా న‌టించిన సోనూసూద్.. త‌మ‌ రియ‌ల్ హీరో అంటూ భారీ కటౌట్‌లు పెడుతున్నారు. 

వ‌ద‌ల బోమ్మాళి... వ‌ద‌లా అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను వ‌ద‌ల‌ని యాక్ట‌ర్ సోనూసూద్(Sonu Sood). విల‌న్ క్యారెక్ట‌ర్ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గర‌య్యారు. క‌రోనా టైంలో సోనూ సూద్ వ‌ల‌స‌ కూలీల‌కు చేసిన స‌హాయం చాలా గొప్ప‌ది. అందుకే సోనూ సూద్ త‌మ‌కు ఎప్ప‌టికీ రియ‌ల్ హీరోనే అంటున్నారు.

Sonu Sood

ఆచార్య సినిమాలో సోనూసూద్ బ‌స‌వ అనే విలన్ పాత్ర‌లో న‌టించారు. సోనూ న‌ట‌న‌కు మెచ్చిన అభిమానులు భారీ క‌టౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శాంతి థియేటర్ ద‌గ్గ‌ర‌ సోనూసూద్‌కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. సోనూసూద్ క‌టౌట్‌ల‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. విల‌న్ పాత్ర చేసిన సోనూసూద్‌కి గుమ్మ‌డికాయ‌ల‌తో దిష్టి తీస్తున్నారు. ప్ర‌స్తుతం సోనూ సూద్ క‌టౌట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. సినిమా రిలీజ్ అయిన రోజు సోనూసూద్‌పై నోట్ల క‌ట్ట‌లు విసిరారు అభిమానులు. 

కరోనా తర్వాత కూడా సోనూసూద్(Sonu Sood) ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలని చేస్తున్నారు. ప్ర‌తీ రాష్ట్రంలో సోనూసూద్ సేవా కార్య‌క్ర‌మాలు కొనసాగుతున్నాయి. సోనూసూద్ చాలా మందికి దేవుడిగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సోనూసూద్ చాలా మందికి సహాయం చేసి రియ‌ల్ హీరోగా మారారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!