ఆప్షన్స్ ఇస్తే నచ్చదంటున్న రాంచరణ్ (RamCharan)

Updated on Apr 24, 2022 08:42 PM IST
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి, రాంచరణ్‌ (RamCharan)
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి, రాంచరణ్‌ (RamCharan)

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌‌స్టర్ రాంచరణ్ (RamCharan) నటించిన ఆచార్య సినిమా త్వరలో రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిరు, చరణ్ ఇద్దరూ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా జరిగింది. ఆదివారం ఆయన కొంతసేపు మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటరాక్షన్‌లో ఆచార్య సినిమా విశేషాలతోపాటు తన తర్వాతి సినిమా గురించి కూడా పలు విషయాలను పంచుకున్నారు.

తనతో ఎలాంటి కథ తీస్తే బాగుంటుందో ఫిక్స్ అయ్యి వస్తే బెటర్‌‌ అని, అంతేకానీ ఆప్షన్స్‌ ఇస్తే తనకు నచ్చదని రాంచరణ్‌ అంటున్నాడు. ఇటీవల ఒక పెద్ద డైరెక్టర్ తన వద్దకు నాలుగు స్టోరీలు తీసుకుని వచ్చాడని, అందులో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేసుకోవాలన్నారని చెప్పాడు. ‘నాకు ఏ కథ బాగుంటుందో మీరే సెలెక్ట్ చేయాలని చెప్పేశాను. ఇక, గౌతం తిన్ననూరి ఒక కథ ఫిక్స్ అయ్యి వచ్చాడు. ఏ జోనర్‌‌ మూవీ చేయాలని అనుకుంటున్నారని అడిగాడు. గౌతం సినిమా అంటే కచ్చితంగా బలమైన ఎమోషన్ ఉంటుంది. కేవలం మూడే మూడు క్యారెక్టర్లతో జెర్సీ సినిమా తీసి సత్తా చాటుకున్నాడు. అందుకే తనను నమ్ముతున్నాను. గౌతం ఎటువంటి కథతో సినిమా చేద్దామని అనుకున్నాడో అదే కథతో సినిమా చేద్దామని చెప్పాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా స్పోర్ట్స్‌ డ్రామా మాత్రం కాదని, వేరే జోనర్‌‌లోనే ఉంటుంది’ అని క్లారిటీ ఇచ్చాడు చరణ్.

ఇక, శంకర్‌‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాషూటింగ్‌ 60 శాతం పూర్తయ్యింది. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే గౌతం సినిమా మొదలవుతుందని చరణ్ చెప్పాడు. ​ చిరంజీవి, రాం​ చరణ్​ (Ram Charan)  కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  ఇటీవలే విడుదలైన ట్రైలర్​ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్​ 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రమోషన్లు కూడా ప్రారంభించి ఈరోజే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కూడా నిర్వహిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్‌‌ బోర్డు.​​

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!