ఆచార్య (Acharya) సినిమా రివ్యూ

Updated on Apr 29, 2022 04:47 PM IST
ఆచార్య(Acharya)  సినిమా ఎలా తీశారు?. ఈ సినిమా క‌థపై వ‌స్తున్న టాక్ ఏంటి?. ఏం అంశాలు ప్ర‌ధానంగా చూపించారు?. ఆచార్య సినిమా ప్ల‌స్‌లు ఏంటి.. మైన‌స్ పాయింట్ ఏమై ఉంటుంది. ఓవ‌ర్ ఆల్‌గా ఆచార్య సినిమా రివ్యూ ఏంటో తెలుసుకుందాం. 
ఆచార్య(Acharya)  సినిమా ఎలా తీశారు?. ఈ సినిమా క‌థపై వ‌స్తున్న టాక్ ఏంటి?. ఏం అంశాలు ప్ర‌ధానంగా చూపించారు?. ఆచార్య సినిమా ప్ల‌స్‌లు ఏంటి.. మైన‌స్ పాయింట్ ఏమై ఉంటుంది. ఓవ‌ర్ ఆల్‌గా ఆచార్య సినిమా రివ్యూ ఏంటో తెలుసుకుందాం. 

ఆచార్య.. నిన్నటి వరకు చిరు అభిమానులనే కాకుండా, యావత్ సినీ అభిమానులలో ఆసక్తిని రేపిన చిత్రమిది. నిజ జీవితంలో తండ్రీ, కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్‌లు రీల్ లైఫ్‌లో ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారంటే.. ఆ కిక్కే వేరు కదా. ఈ పాయింట్ ఒక్కటి చాలు.. సినిమా అంచనాలను అమాంతం పెంచేయడానికి? పైగా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సబ్జెక్టు కాబట్టి, కథ కూడా పకడ్బందీగానే ప్లాన్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. మరి అదే కథ స్క్రీన్ మీద ఎలా వర్కవుట్ అయ్యిందో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన పాజిటివ్, నెగటివ్ పాయింట్లతో పాటు.. ఓవ‌రాల్‌గా ఆచార్య సినిమా ఎలా ఉందో మనమూ తెలుసుకుందాం.!

సినిమా - ఆచార్య‌ (Acharya) 
నటీ న‌టులు - చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, పూజా హెగ్డే, సోనూ సూద్
ద‌ర్శ‌కుడు- కొర‌టాల శివ‌
రేటింగ్ - 2/5

 

Acharya Movie Still

ప్ల‌స్ పాయింట్స్
చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు
మ‌ణిశ‌ర్మ సంగీతం
టెంపుల్ సెట్

మైన‌స్ పాయింట్స్
క‌థ‌
ద‌ర్శ‌క‌త్వం

Acharya Movie Still

సినిమాలోని పాత్రలు
ఆచార్య (Acharya)  - చిరంజీవి
సిద్ధా -  రామ్ చ‌ర‌ణ్
రాథోడ్ - జిష్షూ సేన్ గుప్త
బ‌స‌వ - సోనూ సూద్
నీలాంబ‌రీ - పూజ హెగ్డే

Acharya Movie Still

ఆచార్య క‌థ ఏంటి?
ప్ర‌కృతి బిడ్డ‌లున్న ప్రాంతాలు ధ‌ర్మ‌స్థ‌లి, పాద‌ఘ‌ట్టం.  విలువైన ఖ‌నిజాలు దొరికే ఈ ప్రాంతాలను దుష్టుల బారి నుండి కథా నాయకులు ఎలా కాపాడారన్నదే ఆచార్య సినిమా నేపథ్యం.  సిద్ధ‌వ‌నంలో దొరికే మైన్స్‌ను రాథోడ్ ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తాడు. అందుకే బ‌స‌వ సాయంతో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతుంటాడు.  ప్ర‌జ‌ల‌ను ఊరు ఖాళీ చేయించి, దూర ప్రాంతాలకు పంపించేయాలని చూస్తాడు. దీంతో ఆ జ‌నాల‌కు అండ‌గా ఉండేందుకు ఆచార్య ఎంటర్ అవుతాడు.  పాదఘట్టానికి చెందిన సిద్ధా అనే వ్యక్తి తనకు తెలుస‌ని.. అత‌న్ని కలిసేందుకే ఆ ప్రాంతానికి వచ్చానని ఆచార్య చెబుతాడు. పాద‌ఘ‌ట్టంలో అంద‌రికీ అభిమానపాత్రుడైన వ్యక్తి సిద్ధా. కానీ సిద్ధా ఎక్క‌డికి వెళ్లాడన్నది ఎవ‌రికీ తెలియ‌దు. సిద్దా కోసం వచ్చిన ఆచార్య జనాల కోసం ఏం చేశాడ‌న్నదే ఈ చిత్ర కథాంశం. 


సినిమా సాగిందిలా..
చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు ఇద్ద‌రు క‌లిసి న‌టించిన సినిమా ఆచార్య. వీరిద్దరూ అద్భుతంగా నటించారు. అందులో సందేహమే లేదు. అయితే ఇది వారిద్ద‌రికీ  సరిపోయే కథ కాద‌నిపించింది. హ‌డావుడిగా సినిమాను తీసేసి థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారేమో అని మనకు అనిపిస్తుంది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు తండ్రి కొడుకులుగా క‌లిసి పూర్తి స్థాయిలో చేసిన మొద‌టి చిత్రం ఇది. మరి ఆ క‌థ ఏ రేంజ్‌లో ఉండాలి? కానీ కొర‌టాల శివ రాసుకున్న కథ ఈ ఆచార్య సినిమాకు సెట్ కాలేదనిపించింది. ఇంకా ఎక్కువ వ‌ర్క్ చేసి ఉంటే బాగుండేది. 


ఫైన‌ల్ టాక్
కాషాయం, క‌మ్యూనిజం.. ఈ సిద్ధాంతాలను పాటించేవారు నిజానికి ఆ గ‌ట్టుకొక‌రు, ఈ గ‌ట్టుకొకరులా ఉంటారు. న‌క్స‌లిజం భావాలు కలిగినవారు మ‌తం గురించి ఎక్కువగా ఆలోచించరు. సాయుధ పోరాటం గురించే ఆలోచిస్తారు. కానీ ఆచార్య సినిమాలో ఇదే విషయానికి సంబంధించి క్లారిటీ మిస్ అయ్యిందనిపించింది.  ప్రస్తుతం ఈ విషయాలనే ప్రేక్ష‌కులు తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఆచార్య (Acharya)  సినిమాను లాజిక్ లేని అంశాలతో తెర‌కెక్కించార‌ని పలువురు  పోస్టులు కూడా పెట్టారు. 

Acharya Movie Still

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!