ఆచార్య(Acharya)తో తలపట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లు
ఆచార్య(Acharya) ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. నష్టాలను కొంతైనే తగ్గించే పనిలో ఆచార్య టీం ప్లాన్ చేస్తుంది. అమెజాన్ ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనుకున్నంత రేంజ్‌లో థియేటర్లలో ఆడలేదు. నాలుగు రోజులకే థియేటర్ల నుంచి వెళ్లిపోతుంది. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో ఆచార్య డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. చిరంజీవి సినిమాలు హాట్ కేకుల్లా హిట్లు కొడతాయనుకున్న వారికి బ్యాడ్ టైం నడుస్తుంది.
రామ్ చరణ్ చనిపోవడం ఆడియన్స్‌కు నచ్చలేదా?. ఎడిటింగ్ సరిగ్గా లేదనే టాక్‌తో ఆచార్య సినిమా చూడటం మానేశారా?. మొత్తానికి ఆచార్య సినిమా రేటింగ్ కుదేలైంది. దీంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. డిజాస్టర్ సినిమాతో డేంజర్‌లో పడ్డారు. ఆచార్య విడుదలైన రెండో రోజే సినిమా హాల్లు ఖాళీగా కనిపించాయి. ఈ సినిమాను 150 కోట్ల రూపాయల టార్గెట్‌తో రిలీజ్ చేశారు. టికెట్ రేటు కూడా బానే పెంచారు. కానీ ప్రపంచ స్థాయి కలెక్షన్ చూస్తే ఇప్పటివరకు 45 కోట్ల రూపాయలే వచ్చింది. వంద కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది.
అమెజాన్‌లో కాస్త ముందుగా రిలీజ్ చేయాలని ఆచార్య(Acharya) టీం ప్లాన్ చేస్తుందట. అనుకున్న టైం కన్నా ముందు అమెజాన్‌లో రిలీజ్ చేస్తే ఒప్పందం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తారట. ఆ ప్లాన్‌తో కొంత వరకైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చని అనుకుంటున్నారట ఇలాగైనా ఆచార్య డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలని చూస్తున్నారట.
చిరంజీవి, రామ్ చరణ్‌లు తమ రెమ్యునరేషన్‌లో రూ.10 కోట్లు తగ్గించారట. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కూడా డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని మాట ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్‌తో కొత్త సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ సినిమా పూర్తి అయ్యేలోపు డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని కొరటాల చెప్పారు. తన సినిమా రిలీజ్ లోపు ఆచార్య ఫైనాస్స్ వ్యవహారాలు చక్కబెట్టాలని ఎన్టీఆర్ కొరటాలను శివకు చెప్పారు. చిరంజీవి ఆచార్య(Acharya) సినిమా తమకు తీవ్ర నష్టాలను మిగిల్చిందనిడిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకున్నారు.