మెగా ఫ్యాన్స్‌కు ఆచార్య (Acharya) నుంచి మరో సర్‌‌ప్రైజ్

Updated on Apr 21, 2022 04:43 PM IST
Chiranjeevi and Ramcharan
Chiranjeevi and Ramcharan

మెగాస్టార్‌‌ ఫ్యాన్స్‌కు ఆచార్య (Acharya) చిత్ర యూనిట్‌ మరో సర్‌‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేసిన టీం తాజాగా మరో పాటను రిలీజ్ చేసింది. ‘భలే భలే బంజారా’ అంటూ సాగే ఈ పాటకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌‌స్టార్‌‌ రామ్‌చరణ్‌ వేస్తున్న స్టెప్స్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. చిరంజీవి ఒక్కడు స్క్రీన్‌ మీద కనిపిస్తేనే ఫ్యాన్స్‌ ఫిదా అవుతారు. అటువంటిది రామ్‌చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడంటే ఇక అభిమానులకు పండుగే. 

ఇక, వీరిద్దరూ కలిసి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్‌ చేసిన పాటకు డ్యాన్స్‌ చేస్తుంటే థియేటర్లలో అభిమానులు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సోమవారం రిలీజ్‌ అయిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. కొణిదెల సురేఖ ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌‌లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 29న రిలీజ్‌ కాబోతున్న ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 23న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!