Acharya: "నేనూ, నాన్న ఒకే కాటేజ్‌ను షేర్ చేసుకున్నాం" అంటూ చెర్రీ భావోద్వేగం

Updated on Apr 20, 2022 11:58 PM IST
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. కరోనా ప్రభావిత కాలంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ఆ తర్వాత కూడా షెడ్యూల్స్ సరిగ్గా లేకపోవడంతో.. అలా వాయిదా పడుతూనే వచ్చింది. తర్వాత రిలీజ్ డేట్ విషయంలో కూడా నానా తర్జనభర్జనలు జరిగాయి.  చివరకి ఏప్రిల్ 29 తేదిన ఆచార్యను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు జనాలను విపరీతంగా ఆకర్షించాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటీనటులతో పాటు సాంకేతిక వర్గం కూడా పలు ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా నటుడు రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు

"నాన్నతో కలిసి షూటింగ్‌లో పాల్గొనడం ఒక అందమైన ఎక్స్‌పీరియన్స్.నేను మాటల్లో చెప్పలేను. 20 రోజులు కలిసి ఇద్దరం ఒకే కాటేజీలో ఉన్నాం. కానీ హైదరాబాద్‌లో మాత్రం మేమిద్దరం విడిగానే ఉంటున్నాం. అప్పుడప్పుడు ఆదివారాలు మాత్రమే కలుస్తాం. అలాంటి సందర్భంలో ఆచార్య సినిమా షూటింగ్ అనేది మా ఇద్దరినీ ఒక కాటేజీని షేర్ చేసుకొనే వీలు కల్పించింది. నెల రోజులు మేమిద్దరం కలిసే ప్రయాణించాం. ఉదయానే లేవడం, కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం, ఆ తర్వాత ఇద్దరం ఒకే కారులో షూటింగ్ లోకేషన్‌కు వెళ్లడం.. ఇవ్వన్నీ చాలా మంచి మెమరీస్. ఇద్దరం కలిసే వర్కవుట్ చేసేవాళ్లం. మళ్లీ ఆ రోజులు వస్తాయా. అందుకే ఈ షూటింగ్ అనేది నాకు మర్చిపోలేని అనుభవం. నాన్న నన్ను ఓ రోజు పిలిచి "చరణ్.. మళ్లీ మనకు ఎప్పటికోగానీ ఈ అవకాశం రాదు. అందుకే ప్రతి నిముషం ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అన్నారు. నేను చెప్పాలనుకున్న మాటను ఆయన చెప్పారు" అని భావోద్వేగానికి గురయ్యారు రామ్ చరణ్. 

.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!