Acharya: ఆచార్యుడిపై చిరంజీవి ఎమోష‌న‌ల్ ట్వీట్

Updated on May 03, 2022 06:37 PM IST
Acharya: చిరంజీవి సినీ గురువు దాస‌రి నారాయ‌ణ‌రావు. త‌న గురువును గుర్తుచేసుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ట్విట్ట‌ర్‌లో కొత్త మార్పులు చేసి మ‌రీ ట్వీట్ చేశారు చిరు.

ఆచార్య సినిమా చిరంజీవికి ఆశించినంత హిట్ ఇవ్వ‌లేదు. చిరంజీవి త‌న గురువు దాస‌రినారాయ‌ణ రావును గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ పెట్టారు. దాస‌రి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా నివాళి అర్పించారు. దర్శకులందరికి గురువుగారు, పరిశ్రమలో అందరికి  ఆపద్బంధువు అంటూ దాస‌రిని గుర్తుచేసుకున్నారు. త‌న‌కు మార్గ‌ద‌ర్శి, ఆప్తులు అయ‌న దాస‌రి జ‌న్మ‌దినోత్స‌వం రోజు స్మ‌రించుకుంటున్నామ‌ని ట్వీట్ చేశారు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఎప్పుడూ త‌న గుండెల్లో స‌జీవంగానే ఉంటార‌ని చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. 

చిరంజీవికి సంబంధించిన సోష‌లో మీడియా అకౌంట్ల‌లో ఆచార్య అని ఉండేది. ఆచార్య సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అలా చేశారు. ఆచార్య అని తీసేని ఇప్పుడు చిరంజీవి కొణిదెల అని మార్చారు. దాస‌రి నారాయ‌ణ రావు జ‌యంతి కావ‌డంతో ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. 

చిరంజీవి చేయి ప‌ట్టుకుని న‌డిపిస్తున్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఫోటోను షేర్ చేశారు. ఆచార్య డిజాస్ట‌ర్ నుంచి చిరంజీవి బ‌య‌ట ప‌డ‌లేక‌పోతున్నారు. చిరంజీవి త‌న భార్య సురేఖ‌తో క‌లిసి ఇంట‌ర్నేష‌న‌ల్ టూర్ వెళ్లారు. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!