'ఆచార్య' (Acharya) ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది..!

Updated on Apr 27, 2022 09:05 PM IST
రామ్ చ‌ర‌ణ్, మెగా స్టార్ చిరంజీవి (Mega Star chiranjeevi)
రామ్ చ‌ర‌ణ్, మెగా స్టార్ చిరంజీవి (Mega Star chiranjeevi)

మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి(Mega star Chiranjeevi) తో పాటు ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఓ ప్ర‌త్యేక పాత్రలో న‌టించాడు. ఇక‌, రామ్ చ‌ర‌ణ్ (Ram charan) కు జోడీగా బుట్ట బొమ్మ‌ పూజా హెగ్డే (Pooja Hegde) తొలిసారి న‌టిస్తోంది. రెజీనా క‌సెండ్రా స్పెష‌ల్ సాంగ్ లో మెర‌వ‌నుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు.

శ్రీమ‌తి కొణిదెల సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మామూలుగా మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల్లో ఫుల్ జోష్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి ఇదివ‌ర‌కే రిలీజ‌యిన పాట‌లు, ట్రైల‌ర్ అంచ‌నాలను మ‌రింత‌ పెంచేశాయి.


ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూ తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఓవ‌ర్ సీస్ సెన్సార్ బోర్డు స‌భ్యుడైన ఉమైర్ సంధు తొలి రివ్యూను ఇచ్చేశాడు. సినిమా అదిరిపోయింద‌ని.. చిరు, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఇర‌గ‌దీసారని పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసిన చ‌ర‌ణ్ ఈ మూవీలో మ‌రోసారి అద‌ర‌గొట్టాడ‌ని అన్నాడు. తండ్రీ,కొడుకులు ఇద్ద‌రూ న‌ట‌న‌లో పోటీపడ్డార‌ని అన్నాడు. ఈ మేర‌కు ఉమైర్ సంధు ట్విట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇక‌, ఫ‌స్ట్ రివ్యూ పాజిటివ్ గా రావ‌డంతో మెగా అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!