ఆచార్య (Acharya): ట్విట్టర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య(Acharya) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్విట్టర్‌లో ఆచార్య సినిమా రివ్యూలు ట్రెండ్ అవుతున్నాయి. చిరు ఫ్యాన్స్ సినిమాపై ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు.
రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన సినిమా ఆచార్య(Acharya). చాలా సార్లు వాయిదా పడి ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఆచార్య సినిమా పాటలు, టీజర్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఆచార్య టీం వరుస ప్రమోషన్లు కూడా ప్రేక్షకుల అంచనాలు పెంచాయి.ఆచార్య సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించారు.
ఆచార్య సినిమా చాలా బాగుందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. శివ కొరటాల చాలా బాగా తీశారని చెప్పారు. చిరు డాన్స్, సీన్స్ అదరిపోయంటూ పోస్ట్ చేశారు. బంజారా పాట చాలా నచ్చిందని చెప్పాడు
కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ఆచార్య(Acharya)కు ట్విటర్ రేటింగ్ మొదలైంది. ఓవర్సీస్ ప్రీవ్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకుల రివ్యూ ప్రకారం ఫస్ట్ ఆఫ్ డీసెంట్‌గా ఉందట. చివరి 40 నిమిషాలు మోగా ఫాన్స్ కోసం తీశారని ట్వీట్ చేశారు. పాటలు బాగున్నాయని అంటున్నారు. క్లైమాక్స్ మాత్రం హిందూ మతం గురించిన సందేశం ఉండని కామెంట్ చేస్తున్నారు.
విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది ఆచార్య(Acharya) . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు పైగా థియేటర్లలో ఈ సినిమానువిడుదల చేశారు. ఆచార్య ఓవర్ ఆల్‌గా చూస్తే మిశ్రమ స్పందన వస్తుంది. మెగా ఫాన్స్ ఆశించినంతగా కొరటాల శివ ఆచార్యను తీయలేకపోయారనే టాకే ఎక్కువ వినిపిస్తుంది.
సోషల్ మీడియాలో ఆచార్య(Acharya) సినిమా చూసి ప్రేక్షకుల పోస్ట్ చేసిన అభిప్రాయాలను పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం షేర్ చేస్తున్నాం.