హాలీడే ట్రిప్‌కు వెళ్తున్న‌ ఆచార్య‌(Chiranjeevi)

Updated on May 03, 2022 05:54 PM IST
Chiranjeevi: చిరంజీవి చాలా రోజుల త‌ర్వాత హాలీడే ట్రిప్‌కు వెళ్లారు. క‌రోనా త‌ర్వాత వెళ్తున్న తొలి ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్నీ అంటూ చిరు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఏ టూర్ ప్లాన్ చేశారో..

మోగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)  సైరా, ఆచార్య సినిమాల‌తో చాలా బిజీ షెడ్యూల్‌లో గ‌డిపారు. కొత్త ప్రాజెక్టులకు కూడా చిరు సైన్ చేశారు. కొత్త సినిమాలు స్టాట్ చేసే ముందు చిరు ఓ షాట్ బ్రేక్ తీసుకోవాల‌నుకున్నారు. భార్య సురేఖ‌తో క‌లిసి హాలీడే ట్రిప్‌కు ప్లాన్ చేశారు. 
 
కరోనా తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ అంటూ చిరంజీవి ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తాన‌న్నారు. స్పెష‌ల్ ఫ్లైట్‌లో  సురేఖ‌తో దిగిన పోటోను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.చిరంజీవి పోస్ట్ చూసిన కూతురు శ్రీజ, కోడలు ఊపాసన కామెంట్స్ పెట్టారు. ఎంజాయ్‌ అమ్మ అండ్‌ డాడీ, ఐలవ్‌ యూ సో మచ్ అంటూ శ్రీజ.. హ్యాపీ టైమ్ అత్త‌య్య‌, మామ‌య్య అని ఉపాసన కామెంట్‌ చేశారు.

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుద‌లైంది. అనుకున్నంత ఆచార్య స‌క్సెస్ కొట్ట‌లేక‌పోయింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ మేకింగ్ లో భోళాశంకర్, మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ , బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు. రాధిక శ‌ర‌త్‌కుమార్ సొంత సంస్థ రాడాన్ పిక‌ర్స్ చిరంజీవి(Chiranjeevi) తో ఓ సినిమా నిర్మించ‌నుంది.అందుకు చిరంజీవి కూడా ఓకే చెప్పారు. 
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!