The Ghost : 'ది ఘోస్ట్' మూవీ గ్లింప్స్ రిలీజ్ & కత్తులతో నాగార్జున వేట.. మీకోసమే ఈ టాప్ 5 ఆసక్తికర విషయాలు

Updated on Jul 09, 2022 09:54 PM IST
'ది ఘోస్ట్' మూవీ పోస్టర్ (The Ghost Movie Poster)
'ది ఘోస్ట్' మూవీ పోస్టర్ (The Ghost Movie Poster)

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ది ఘోస్ట్‌'. 'బంగార్రాజు' త‌ర్వాత నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. 

నాగార్జున లుక్ అదుర్స్

కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో (The Ghost Glimps) హీరో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్ గా, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. ఇందులో నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు.

సంగీతం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది

యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఈ గ్లింప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకు వెళ్ళింది. ఈ వీడియో 'ది ఘోస్ట్' సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.

సోనాల్ చౌహాన్ కథానాయికగా

'ది ఘోస్ట్‌' చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ (Sonal Chouhan) కథానాయికగా నటిస్తోంది. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ వైదొలగడంతో, ఆమె స్థానంలో సోనాల్ చౌహా‌న్‌ను తీసుకున్నారు.  ఈ చిత్రంలో నాగ్‌, సోనాల్‌ ఇద్దరూ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌ పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే అనిఖా సురేంద్రన్, గుల్‌ పనాగ్‌ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.

రిలీజ్ డేట్ ఇదే

ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 5న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. 

పుకార్లకు చెక్ పెట్టిన నాగ్

ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ శ‌నివారం జ‌రిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో (The Ghost Movie Promotional Event) రిలీజ్ డేట్ ను ప్రకటించి, ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు.

శివ విడుదలైన రోజున..

నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ 'శివ' కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జునతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్,  రామ్ మోహన్ రావు, శరత్ మరార్.. నటులు మహేంద్ర, క్రిష్, రవి వర్మ పాల్గొన్నారు.

Read More: Akkineni Nagarjuna: టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున కెరీర్ లో టాప్ 10 సినిమాలివే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!