విశాల్ (Vishal) నటిస్తున్న కొత్త చిత్రం 'మార్క్ ఆంటోనీ .. ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సూపర్ రెస్పాన్స్ !

Updated on Aug 29, 2022 05:12 PM IST
విశాల్ (Vishal) తెలుగు వాడైనా, తమిళ తెరపై స్టార్ హీరోగా తనదైన శైలిలో సత్తా చాటుతున్నారు.
విశాల్ (Vishal) తెలుగు వాడైనా, తమిళ తెరపై స్టార్ హీరోగా తనదైన శైలిలో సత్తా చాటుతున్నారు.

త‌మిళ్ స్టార్ హీరో విశాల్ (Vishal) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ హీరో ప్రస్తుతం వ‌రుస‌ విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. కాగా, నేడు విశాల్ (Vishal) బర్త్ డే. ఈ సందర్భంగా.. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'మార్క్‌ ఆంటోని' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. 

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న 'మార్క్‌ ఆంటోని' సినిమాకు ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎజే సూర్య కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.

పాన్ ఇండియా సినిమాగా

పాన్ ఇండియ‌న్ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.ప్ర‌స్తుతం 'మార్క్ ఆంటోనీ' షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ న‌టి రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఆమె క్యారెక్ట‌ర్ కూడా కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు.. విశాల్ 'మార్క్ ఆంటోనీ'తో పాటు, మరో చిత్రం 'లాఠీ' కూడా తెరకెక్కబోతోంది.

ఉగ్రరూపంలో విశాల్

అయితే.. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌‌లో విశాల్‌ (Vishal) ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు.  లుంగీలో గడ్డంతోపాటు నుదుటి మీద తిలకం, చేతిలో గన్‌తో ఊర మాస్‌ లుక్‌లో ఉన్నారు. అంతేకాకుండా ‘హ్యాపీ బర్త్ డే పురాచ్చి దళపతి’ అని శుభాకాంక్షలు చెబుతూ కొత్త స్టార్ ట్యాగ్ ‌కూడా ఇచ్చారు. ఆ లుక్‌ చూసిన విశాల్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ మాస్ పోస్ట‌ర్ విశాల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

'మార్క్ ఆంటోనీ' పోస్ట‌ర్‌ను చూస్తుంటే ఈ చిత్రంలో విశాల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మినీ స్టూడీయోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎస్. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Read More:  విశాల్ (Vishal) హీరోగా తెరకెక్కిన ‘లాఠీ’ సినిమా తెలుగు ట్రైలర్.. అంచనాలు పెంచేలా యాక్షన్‌ సీన్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!