ఇన్ని సంవత్సరాలు చేసిన కామెంట్లు చాలు.. సారీ చెప్పండి లేకుంటే పరువు నష్టం దావా వేస్తా: ధనుష్ (Dhanush)

Updated on May 24, 2022 10:28 AM IST
తండ్రితో హీరో ధనుష్
తండ్రితో హీరో ధనుష్

కొన్ని సంవత్సరాలుగా తమ పరువు తీస్తున్నది చాలు అని, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నటుడు ధనుష్ (Dhanush), ఆయన తండ్రి కస్తూరి రాజా  తమిళనాడుకు చెందిన ఒక ఫ్యామిలీకి లీగల్‌ నోటీసులు పంపించారు. ధనుష్‌ తమ మూడో కుమారుడు అని, సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడని మధురైకి చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు నాలుగు సంవత్సరాల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. నటుడిగా స్థిరపడిన నాటి నుంచి ధనుష్‌ తమకు ప్రతి నెలా రూ.65 వేలు పంపిస్తున్నారని ఆ దంపతులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో విసిగిపోయిన ధనుష్‌, ఆయన తండ్రి కసూర్తిరాజా.. తాజాగా ఆ దంపతులకు లీగల్‌ నోటీసులు పంపించారు. తమ గౌరవానికి భంగం కలిగేలా కామెంట్లు చేస్తున్న ఆరోపణలను ఇకనైనా ఆపాలని కోరారు. ఇంతకాలం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ క్షమాపణలు చెప్పాలని నోటీసులిచ్చారు. ఈ మేరకు ఒక స్టేట్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ధనుష్‌ ఆ నోటీసుల్లో పేర్కొన్నాడు.

మధురైలో ఉండే కథిరేసన్, మీనాక్షి దంపతులు.. ధనుష్ తమ కొడుకే అంటూ కొన్ని సంవత్సరాల క్రితం మీడియా ముందుకు వచ్చారు. చిన్నప్పటి నుండి ధనుష్‌కు సినిమాలంటే ఇష్టమని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయాడని మీడియాతో చెప్పారు. కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ అంశం చాలాకాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే తరచూ ఈ వివాదంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో విసిగిపోయిన ధనుష్.. తన తండ్రి కస్తూరి రాజాతో కలిసి కథిరేసన్‌కు లీగల్ నోటీసులు పంపాడు.

కాగా, ధనుష్, ఆయన భార్య, రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య కొద్దిరోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ధనుష్, ఐశ్వర్య18 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే ధనుష్ తండ్రి, తమిళ చిత్రనిర్మాత కస్తూరి రాజా విడాకుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కుటుంబ కలహాలే కారణమని చెప్పారాయన. 2004లో ధనుష్, ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడంపై ధనుష్ తండ్రి, తమిళ దర్శకుడు కస్తూరి రాజా స్పందించారు.ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్, ఐశ్వర్య విడిపోవడం కేవలం విభేదాల కారణంగానే జరిగిందని వ్యాఖ్యానించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!