Ram Charan : రామ్ చరణ్‌తో క్రేజీ కాంబినేషన్ .. 'విక్రమ్' దర్శకుడితో కొత్త సినిమా ?

Updated on Jun 23, 2022 01:29 PM IST
టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan)పై లోకేష్ క‌న‌గ‌రాజ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.
టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan)పై లోకేష్ క‌న‌గ‌రాజ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

ఆర్.ఆర్.ఆర్ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) రేంజ్ మ‌రింత పెరిగింది. అల్లూరి సీతారామ‌రాజును పోలిన పాత్రలో రామ్ చ‌ర‌ణ్ త‌న న‌ట విశ్వ‌ రూపం చూపించారు. రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో రామ్ చ‌ర‌ణ్ ఆర్‌సీ 15లో న‌టిస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ హీరోగా మ‌రో సినిమా విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంద‌ట‌. 

రామ్‌తో లోకేష్ సినిమా
త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు మారుమోగుతోంది. క‌మ‌ల్ హాస‌న్‌తో లోకేష్ క‌న‌గ‌రాజ్ విక్ర‌మ్ సినిమాను తెర‌కెక్కించారు. విక్ర‌మ్ చిత్రం బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

విక్ర‌మ్ సినిమా స‌క్సెస్‌తో లోకేష్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇదే క్రమంలో, ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేసేందుకు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. ఇక టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్‌పై లోకేష్ క‌న‌గ‌రాజ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

రామ్ చ‌ర‌ణ్‌తో త‌న‌కు చాలా క్లోజ్ అని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ అంటున్నారు. ఏ స‌మ‌యంలోనైనా రామ్ చ‌ర‌ణ్‌తో మాట్లాడే చ‌నువు త‌న‌కుంద‌ని చెప్పారు. విక్ర‌మ్ స‌క్సెస్ పార్టీ కోసం హైద‌రాబాద్ వెళ్లిన‌ప్పుడు, చిరంజీవి త‌మ‌ను పార్టీకి పిలిచార‌న్నారు. కానీ చిరు ఇచ్చిన పార్టీకి రామ్ చ‌ర‌ణ్ రాలేద‌ని.. ఫారెన్ టూర్‌లో ఉన్నార‌ని లోకేష్ చెప్పారు.

రామ్ చ‌ర‌ణ్ ఆ పార్టీలో లేక‌పోవ‌డంతో నిరాశ చెందాన‌న్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్‌కు రెండు క‌థ‌ల‌ను లోకేష్ చెప్పార‌ట‌. ఆ క‌థ‌ల్లో ఏదో ఒక‌టి రామ్ ఫైన‌ల్ చేస్తే ... సెట్స్‌ పైకి సినిమాను తీసుకెళ్లడంలో తనకు అభ్యంతరం లేదన్నారు.

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!