Liger: 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల జోరు.. టీ కొట్టులో సంద‌డి చేసిన 'రౌడీ హీరో' (Vijay Deverakonda)

Updated on Aug 07, 2022 10:28 AM IST
Liger: విజ‌య్ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రీక‌రించారు.
Liger: విజ‌య్ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రీక‌రించారు.

Liger: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' సినిమా కొద్ది రోజుల్లో విడుద‌ల కానుంది. 'లైగ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్ల‌ను మేక‌ర్స్ మ‌రింత పెంచారు. మెన్న‌ ముంబై లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. నిన్న టీ స్టాల్‌లో సంద‌డి చేశారు. ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు వ‌చ్చేలా 'లైగ‌ర్' మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొత్త‌గా ప్ర‌మోష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. 

కొత్త కొత్త ఐడియాల‌తో లైగ‌ర్ ప్ర‌మోష‌న్లు

'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'లైగ‌ర్' చిత్ర ప్రమోష‌న్ల‌లో భాగంగా ముంబై మెట్రో రైలులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండేలు ప్ర‌యాణించి సంద‌డి చేశారు. అంతేకాకుండా ముంబైలో చిరంజీవి సినిమా 'గాడ్‌ఫాద‌ర్' షూటింగ్ లొకేష‌న్‌కు చిత్ర యూనిట్ వెళ్లింది. చిరంజీవి, స‌ల్మాన్‌ల‌ను క‌లిసి 'లైగ‌ర్' సినిమా ప్రీమియ‌ర్ షోకు రావాల‌ని కోరింది. 

Liger: విజ‌య్ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రీక‌రించారు.

చాయ్‌వాలాల‌తో విజ‌య్

ప్ర‌స్తుతం విజ‌య్ పూణెలోని ఓ టీ స్టాల్‌కు వెళ్ల‌డం వైర‌ల్‌గా మారింది. పూణె సిటీలోని ఫేమస్ టీ స్టాల్ గ్రాడ్యుయేట్ చాయ్ వాలిను విజయ్ సందర్శించాడు. ఆ టీ కొట్టులో విజ‌య్ టీ కూడా తాగారు. అంతేకాకుండా టీ స్టాల్ నిర్వాహకులతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోల‌ను సినిమా నిర్మాణ సంస్థ అయిన‌ పూరీ కనెక్ట్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో విజ‌య్ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. 'లైగ‌ర్' సినిమాలో కూడా విజ‌య్‌కు టీ స్టాల్ ఉంటుంద‌ట‌. టీ అమ్మే స్థాయి నుంచి బాక్స‌ర్‌గా ఎలా మార‌తాడ‌నేది లైగ‌ర్ క‌థ‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన 'లైగ‌ర్' సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రీక‌రించారు. అందుకోసం కొత్త ప‌ద్ధ‌తుల్లో ప్ర‌మోష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. 'లైగ‌ర్' చిత్ర యూనిట్ నిర్వ‌హిస్తున్న ప్ర‌మోష‌న్లు, ఈవెంట్లతో సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో చూడాలి. 'లైగ‌ర్' సినిమా ఆగ‌స్టు 25 తేదీన‌ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది. 

Read More : 'గాడ్ ఫాద‌ర్' అడ్డాలో 'లైగ‌ర్' (Liger)!.. చిరు, స‌ల్మాన్‌ల‌ను ప్రీమియ‌ర్ షోకు ఆహ్వానించిన 'విజయ్ దేవరకొండ' !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!