'గాడ్ ఫాద‌ర్' అడ్డాలో 'లైగ‌ర్' (Liger)!.. చిరు, స‌ల్మాన్‌ల‌ను ప్రీమియ‌ర్ షోకు ఆహ్వానించిన 'విజయ్ దేవరకొండ' !

Updated on Aug 02, 2022 07:05 PM IST
Liger: 'లైగ‌ర్' ప్రీమియ‌ర్ షోకు రావాలంటూ స‌ల్మాన్‌, చిరంజీవిల‌ను విజ‌య్ దేవరకొండ (Vijay Deverakonda)  ఆహ్వానించారు.
Liger: 'లైగ‌ర్' ప్రీమియ‌ర్ షోకు రావాలంటూ స‌ల్మాన్‌, చిరంజీవిల‌ను విజ‌య్ దేవరకొండ (Vijay Deverakonda) ఆహ్వానించారు.

Liger: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఫేమ‌స్ అయిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'లైగర్' సినిమాతో తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టన్నారు. 'లైగర్' చిత్ర ప్ర‌మోష‌న్లు జోరుగా కొన‌సాగుతున్నాయి. 'లైగ‌ర్' అంచ‌నాల‌ను పెంచేందుకు ఈ చిత్ర మేక‌ర్స్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ల‌ను రంగంలోకి దించారు.

ముంబైలో 'గాడ్‌ఫాద‌ర్' షూటింగ్ లొకేష‌న్‌లో 'లైగ‌ర్' టీమ్ సందడి చేసింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 'లైగ‌ర్' సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

గాడ్‌ఫాద‌ర్‌తో సంద‌డి చేసిన లైగ‌ర్

'లైగ‌ర్' సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌లోనూ త‌న స‌త్తా చాట‌నున్నారు. ఈ సినిమా నుండి ఇటీవ‌లే విడుదలైన విజ‌య్ పోస్ట‌ర్, టీజ‌ర్, పాట‌లు, ట్రైల‌ర్ మొదలైనవి ప్రేక్ష‌కులకు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఇదే క్రమంలో 'లైగ‌ర్' మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. హీరో, హీరోయిన్‌తో వెరైటీగా ప్ర‌మోష‌న్ల‌ను చేయిస్తున్నారు. లోకల్ ట్రైన్స్, రైల్వేస్టేషన్‌లలో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు సందడి చేశారు. అభిమానులతో ముచ్చటించారు,

ప్రీమియ‌ర్ షోకు ఆహ్మానం

చిరంజీవి న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. ఆ షూటింగ్ లొకేష‌న్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మీ కౌర్‌లు వెళ్లారు. 'లైగ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్‌ విశేషాల‌ను చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ల‌తో పంచుకున్నారు. 'లైగ‌ర్' సినిమా ప్రీమియర్ షోకు హాజరు కావాలంటూ స్టార్ న‌టులు చిరంజీవి, స‌ల్మాన్‌ల‌ను కోరారు.

ప్ర‌పంచం మాతో ఉన్న‌ట్టే - విజ‌య్

'లైగ‌ర్' చిత్రం స‌క్సెస్ కావాల‌ని చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ కోరుకున్నార‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ  (Vijay Deverakonda) తెలిపారు. 'వీరిద్ద‌రి ఆశీర్వాదం ఉంటే ప్ర‌పంచం త‌మ‌తో ఉన్న‌ట్టే' అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి, స‌ల్మాన్‌ల‌పై ఎప్ప‌టికీ త‌మ అభిమానం కొన‌సాగుతుంద‌న్నారు. 

Read More: Liger: ముంబైలో మెట్రో రైలు ఎక్కిన 'లైగ‌ర్' జోడి!.. డాన్సులేసిన విజ‌య్ (Vijay Devarakonda), అన‌న్య‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!