ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నా.. కానీ కుదర్లేదు: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

Updated on Oct 13, 2022 01:06 PM IST
మంచి సినిమాతో మళ్లీ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తానని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నారు
మంచి సినిమాతో మళ్లీ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తానని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నారు

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను ‘లైగర్’ (Liger) సినిమా ఫలితం చాలా నిరాశపర్చింది. ఈ మూవీతో టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ బంపర్ హిట్ కొడదామని భావించిన విజయ్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ‘జనగణమన’ (జేజీఎం)లో నటించేందుకు విజయ్ ప్లాన్ చేశారు. కానీ ‘లైగర్’ పరాజయం నేపథ్యంలో ‘జేజీఎం’ అట్టకెక్కినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదు. 

‘లైగర్’ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ మీడియా ముందుకు అంతగా రాలేదు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ‘సైమా అవార్డ్స్’ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా జరిగిన ‘సైమా అవార్డ్స్ 2022’లో విజయ్ దేవరకొండ ‘యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియా’ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం ఆయన ఇచ్చిన ప్రసంగం వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 

‘ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. అద్భుతమైన పెర్ఫామెన్స్‌ల‏తో మీరు ఈ సంవత్సరం సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నాను. అందుకు చాలా ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. మనందరికీ మంచి, చెడు రోజులు వస్తాయి. కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులను కచ్చితంగా, చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి’ అని సైమా పురస్కార వేడుకలో విజయ్ అన్నారు. 

‘ఈ అవార్డ్ ఫంక్షన్‌కు రాకూడదనుకున్నాను. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్పాలని వచ్చాను. మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తానని మాటిస్తున్నాను’ అంటూ విజయ్ దేవరకొండ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుతం విజయ్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ మూవీ చేస్తున్నారాయన. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఒప్పుకున్న విజయ్.. అందులో యాక్ట్ చేస్తారా లేదా పూరి జగన్నాధ్‌తో ‘జేజీఎం’లో నటిస్తారో చూడాలి. ఇక ‘పుష్ప–2’కు సంబంధించిన షూటింగ్‌ పనులతో సుకుమార్ బిజీబిజీగా ఉన్నారు.

Read more: నాకు ప్రేమించేంత సమయం లేదు: రష్మికా మందన్న (Rashmika Mandanna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!