Liger: లైగ‌ర్ కోసం రౌడీ హీరో సాహ‌సం... బోల్డ్ ఫోటోని పోస్ట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)

Updated on Jul 02, 2022 03:18 PM IST
Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ  గులాబీల‌ను మాత్ర‌మే  తన శరీరానికి అడ్డుపెట్టుకున్న ఫోటోను లైగ‌ర్ టీం రిలీజ్ చేసింది.
Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ గులాబీల‌ను మాత్ర‌మే తన శరీరానికి అడ్డుపెట్టుకున్న ఫోటోను లైగ‌ర్ టీం రిలీజ్ చేసింది.

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో సంచ‌ల‌నం సృష్టించింది. దుస్తులు లేని ఫోటోను విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. లైగ‌ర్ కోసం తాను ప‌డిన క‌ష్టాన్ని,  ఆ ఫోటోతో ప్రేక్ష‌కుల‌కు షేర్ చేశారు విజ‌య్. 'లైగ‌ర్' సినిమాని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా విజ‌య్‌తో కొత్త అవ‌తారం ఎత్తించారు పూరి. సోష‌ల్ మీడియాలో విజ‌య్ ఫోటో ఓ వండ‌ర్ క్రియేట్ చేస్తుంది. 

విజ‌య్ సాహ‌సం
'లైగ‌ర్' సినిమా కోసం విజ‌య్ పెద్ద సాహ‌స‌మే చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూడ్‌గా గులాబీల‌ను మాత్ర‌మే అడ్డుపెట్టుకున్న ఫోటోను లైగ‌ర్ టీం రిలీజ్ చేసింది. ఆ ఫోటోను త‌న ట్విట్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌కొండ పోస్ట్ చేశారు. దానికి ఓ ఎమోష‌న‌ల్ కామెంట్ కూడా రాశారు విజ‌య్ (Vijay Deverakonda) .

'గీత గోవిందం'లో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda)  క్లాస్ హీరోగా మెప్పించాడు. 'అర్జున్ రెడ్డి'లో మాస్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టాడు. ప్రస్తుతం 'లైగ‌ర్' సినిమాలో బాక్సర్‌గా తన అభిమానులను ఆయన అలరించనున్నారు. 

 
 
లైగ‌ర్ సినిమా కోసం నేను అన్నిర‌కాలుగా శ్ర‌మించాను. న‌ట‌న విష‌యానికి వ‌స్తే శారీర‌కంగా, మాన‌సికంగా ఈ సినిమాను ఓ ఛాలెంజ్‌లా తీసుకుని న‌టించాను. మిమ్మల్ని అన్ని ర‌కాలుగా ఎంట‌ర్‌టైన్ చేస్తాను. త్వ‌ర‌లో క‌లుద్దాం
విజ‌య్ దేవ‌ర‌కొండ 
 

లైగ‌ర్ ఓ బాక్స‌ర్ క‌థ‌!
బాక్సింగ్ నేప‌థ్యంలో 'లైగ‌ర్' సినిమా తెర‌కెక్కుతుంది. మైక్ టైసన్ కూడా 'లైగ‌ర్' సినిమాలో న‌టిస్తున్నారు.'సాలా.. క్రాస్ బ్రీడ్' అనే డైలాగ్ సినిమాలోని ఏదో ప‌వ‌ర్ ఫుల్‌ సందర్భాన్ని గురించి చెబుతుంది . ఈ సినిమాలో మైక్ టైస‌న్ ఇండియ‌న్ మహిళను పెళ్లి చేసుకుంటాడని ముందుగానే కథను ఊహించి పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. 

'లైగ‌ర్' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'లైగ‌ర్' ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  విడుదల అవబోతోంది. 

Read More: Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కోసం లేడీ వీరాభిమాని.. ఏం చేసిందో చూశారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!