‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ (Ravi Teja) స్టెప్స్‌.. వీడియో వైరల్

Updated on Jul 25, 2022 02:07 PM IST
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ (Ravi Teja) స్టెప్స్‌ వేసి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ (Ravi Teja) స్టెప్స్‌ వేసి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సినిమా రిలీజ్ అవుతోందంటే ఆ జోషే వేరుగా ఉంటుంది. సినిమాలో ఆయన యాక్టింగ్, ఎనర్జీ ఓ రేంజ్‌లో ఉంటాయి మరి. ఇక, తాజాగా రవితేజ నటించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం జరిగింది. ఆ ఈవెంట్‌‌లో రవితేజ మరింత ఎనర్జిటిక్‌గా కనిపించారు.  

ఇక, సినిమా ప్రమోషన్స్‌ ట్రెండ్‌ రోజురోజుకీ మారిపోతోంది. ఇప్పటి వరకూ ఇంటర్వ్యూలు, ఫన్నీ చిట్‌చాట్‌లకే పరిమితమైన ప్రమోషన్స్‌.. ఇటీవలి కాలంలో పబ్లిక్‌ మీటింగ్స్‌లో హీరోలు స్టెప్పులేసి అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకునే స్థాయికి వచ్చాయి. ఇప్పుడు రవితేజ కూడా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇదే ట్రెండ్‌ ఫాలో అయ్యారు. తాజాగా జరిగిన ఈవెంట్‌లో రవితేజ తన సినిమాల్లోని ఐకానిక్‌ స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచారు.

‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ (RaviTeja), నటీనటులు

యాంకర్ సుమ కోరడంతో..

‘విక్రమార్కుడు’ సినిమాలోని ఐకానిక్‌ మూమెంట్స్‌ని రీక్రియేట్‌ చేయమని యాంకర్‌‌ సుమ కోరారు. దీంతో నటీమణులతో కలిసి రవితేజ స్టెప్పులు వేశారు. ‘ఇడియట్‌’ సినిమాలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ పాటకు రవితేజ డ్యాన్స్‌ చేశారు. ఈ స్టెప్స్‌కు అక్కడ ఉన్న వారు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. రవితేజ స్టెప్స్‌ చూసిన వారందరూ..‘పాటొచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్నా రవితేజలో ఏ మాత్రం జోష్‌ తగ్గలేదు’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఖిలాడి’ తర్వాత రవితేజ (Ravi Teja)  నటిస్తోన్న సినిమా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దివ్యాంశ, రజిషా హీరోయిన్లుగా నటించారు.

Read More : భారీ మొత్తంలో డబ్బులిచ్చినందుకే అవార్డు.. హీరోయిన్ సమంత (Samantha) కామెంట్స్‌ వైరల్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!