నా అభిమాన బాక్సర్, లెజెండ్ మైక్ టైసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

Updated on Jun 30, 2022 02:42 PM IST
లైగర్ (Liger) చిత్రంలో విజయ్ దేవరకొండ  ఫైటర్‌ పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు కరణ్ జోహార్ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ఫైనాన్స్ చేస్తోంది.
లైగర్ (Liger) చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ జోహార్ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ఫైనాన్స్ చేస్తోంది.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ (Liger) సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మన రౌడీ స్టార్ విజయ్  లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్‌తో తన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ రోజు మైక్ టైసన్ పుట్టిరోజు సందర్భంగా విజయ్ తన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 

"హ్యాపీ బర్త్ డే మైక్ టైసన్. నేను మిమ్మల్ని జీవితంలో ఒకసారి కూడా కలుస్తానని అనుకోలేదు. అలాంటిది మీతో చాలా విషయాలు పంచుకున్నాను. మీరు నా జీవితంలో  గొప్ప జ్ఞాపకం" అని పోస్టు చేశారు.  మైక్ టైసన్ లైగర్ (Liger) సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయన తొలిసారిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు.

ఆసక్తి రేపుతున్న లైగర్ సినిమా 

లైగర్ (Liger) సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్ 10 జులై తేదిన రిలీజయ్యే అవకాశం ఉంది. అలాగే సినిమాను కూడా ఆగస్టు 25 న విడుదల చేయనున్నారని నిర్మాతలు గతంలో ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి పూరీ జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నారు. 

 

ఎంఎంఏ ఫైటర్‌గా విజయ్ దేవరకొండ

లైగర్ (Liger) చిత్రంలో విజయ్ దేవరకొండ ఎంఎంఏ ఫైటర్‌ పాత్రలో నటిస్తున్నారు. హిందీలో ఈ సినిమాకు కరణ్ జోహార్ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ఫైనాన్స్ చేస్తోంది. పూరీ జగన్నాథ్‌తో పాటు ఛార్మి కౌర్, అపూర్వ మెహతా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విష్ణుశర్మ ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. 

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యక్రిష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను మొదలైనవారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి స్టంట్స్ చేయించడానికి థాయిలాండ్ నుండి ప్రత్యేకంగా కెచా అనే టాప్ స్టంట్స్‌మ్యాన్‌ను పూరీ తీసుకొచ్చారట. 

Read More:  రికార్డు ధరకు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ‘లైగర్‌‌’ రైట్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!