రికార్డు ధరకు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ‘లైగర్‌‌’ రైట్స్‌

Updated on May 03, 2022 07:22 PM IST
‘లైగర్‌‌’లో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే
‘లైగర్‌‌’లో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే

అర్జున్‌రెడ్డి సినిమాతో యూత్‌లో సూపర్ క్రేజ్ సాధించిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. తాజాగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో ‘లైగర్‌‌’ సినిమా చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా వ్యాప్తితోపాటు ఇతర కారణాల వల్ల లైగర్ షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. పరిస్థితులు అన్నీ చక్కబడుతుండడంతో విజయ్‌ స్పీడ్‌ పెంచాడు. మరో కొత్త సినిమా ప్రారంభించేశాడు ఈ యంగ్‌ హీరో. పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం తదితర చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించాడు.

ఇక, పూరీ జగన్నాథ్‌, విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ పాన్‌ ఇండియా సినిమాగా ఈ ఏడాది ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లైగర్‌‌ సినిమాలో విజయ్‌కు తండ్రిగా టైసన్‌ కనిపించనున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇవన్నీ పక్కనపెడితే ఈ సినిమా భారీ బిజినెస్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్‌‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్‌ స్ట్రీమింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. లైగర్ ఆడియో రైట్స్‌ను సోనీ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాక్. ఈ డీల్‌కు సుమారుగా రూ.14 కోట్లు ఖర్చు  చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ వార్తలే గనుక నిజమైతే.. విజయ్ కెరీర్‌‌లో ఆడియో రైట్స్‌కు దక్కిన హయ్యస్ట్‌ అమౌంట్‌ ఇదేనని చెప్పాలి.

ఇక ఓటీటీ హక్కులను కూడా ఒక పెద్ద సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందని సమాచారం. డిస్నీ ప్లస్‌ లైగర్ సినిమా ఓటీటీ హక్కులను భారీ డీల్‌తో సొంతం చేసుకుందని తెలుస్తోంది. అలాగే శాటిలైట్‌ హక్కులను స్టార్‌‌ నెట్‌వర్క్ ఇప్పటికే సొంతం చేసుకుందని టాక్‌. వీటన్నింటిపైనా అధికార సమాచారం అయితే ఇప్పటివరకు అందలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.  

యూత్‌లో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘లైగర్‌‌’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. వీటన్నింటినీ పక్కన పెడితే.. లైగర్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైం భారీ ధరకు ఇప్పటికే సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి. 

లైగర్‌‌ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ కలిసి సుమారు వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. విజయ్‌ (Vijay Devarakonda) సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!