విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) స్టార్ అవుతాడని అప్పుడే చెప్పానంటూ నిర్మాత బండ్ల గణేష్‌ ట్వీట్‌

Updated on May 11, 2022 09:36 AM IST
విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)కు ట్విట్టర్‌‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్
విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)కు ట్విట్టర్‌‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్

యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) పుట్టినరోజు సోమవారం జరిగింది, ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాన్స్​ కూడా సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమాన నటుడికి బర్త్‌డే విషెస్ చెప్పారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ కూడా ఈ రౌడీ బాయ్‌కి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా కొన్ని కామెంట్లు కూడా చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

తనకు కొడుకు పుట్టాడని విజయ్ తండ్రి తనకు చెప్పాడని, అప్పుడే విజయ్‌ దేవరకొండ స్టార్ అవుతాడని చెప్పానని అన్నాడు బండ్ల గణేష్. ‘నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. మే 9వ తేదీన మీ నాన్నగారు వచ్చి నాకు కొడుకు పుట్టాడని చెప్పారు. ఆ బాబును స్టార్స్‌ ఆశీర్వదిస్తారని అప్పుడే చెప్పా. డియర్‌‌ విజయ్.. అన్ని స్టార్స్‌ కలిసి నిన్ను ఇండియన్‌ సినిమా స్టార్‌‌ను చేశాయి. హ్యాపీ బర్త్‌డే విజయ్‌ దేవరకొండ’ అని ట్వీట్‌ చేశాడు బండ్ల గణేష్‌. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్‌ దేవరకొండ క్యూట్‌గా నవ్వుతున్న ఫోటోను ఈ ట్వీట్‌కు గణేష్‌  ట్యాగ్‌ చేశాడు.

ఇక, విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లైగర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక తన తదుపరి సినిమా షూటింగ్‌లో విజయ్‌ బిజీగా ఉన్నాడు. సమంతతో సినిమా చేస్తున్న విజయ్ (Vijay Devarakonda).. ఇటీవల జరిగిన సమంత బర్త్‌డే రోజు ఆమెను సర్‌‌ప్రైజ్‌ చేస్తూ విషెస్ చెప్పాడు.

పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ అయిన బండ్ల గణేష్‌ పవన్‌తో ఇక సినిమాలు తీయాలని అనుకోవడం లేదని కామెంట్‌ చేసి ఇటీవల వార్తల్లోకెక్కాడు. పవన్‌ కల్యాణ్ త్వరగా సీఎం అయిపోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!