కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) గురించి టాప్ 10 ఆసక్తికర విషయాలు మీకోసం

Updated on Sep 08, 2022 07:57 PM IST
హీరో నాగశౌర్య (Naga Shaurya) నటించిన కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) సినిమాకు ఆయన తల్లిగారే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
హీరో నాగశౌర్య (Naga Shaurya) నటించిన కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) సినిమాకు ఆయన తల్లిగారే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari).. గత కొంతకాలం నుండి ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడుసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా రిలీజ్, ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. 

హీరో నాగశౌర్య (Naga Shaurya) ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అలాగే ఓ విదేశీ అమ్మాయి ఈ చిత్రంలో కథానాయికగా నటించడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ చిత్రం గురించి చాలా విషయాలే ఉన్నాయి. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా..!

దర్శకుడి గురించి

అనీష్ కృష్ణ (Anish Krishna) గతంలో లవర్, అలా ఇలా, గాలి సంపత్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్షన్‌లో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రమే ఈ 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో 'అలా ఇలా' ఒక్కటే ఓ మోస్తరు సక్సెస్ అయ్యింది. 

న్యూజిలాండ్ సింగర్ హీరోయిన్‌గా

అల్లాదీన్, 5 వెడ్డింగ్స్, పాసింజర్స్, ఏ జెంటిల్ మ్యాన్ లాంటి సినిమాలలో గతంలో పాటలు పాడిన షిర్లే సేటియా అనే అమ్మాయి ఈ సినిమాలో కథానాయికగా నటించడం విశేషం. షిర్లే గతంలో 'మస్కా' అనే హిందీ చిత్రంలోనూ నటించింది. ఈమెను నిర్మాతలు ఓ తెలుగు సినిమాకి సైన్ చేయించడం ఎంతైనా ఓ విశేషమే.

నిర్మాత ఎవరో తెలుసా

'కృష్ణ వ్రింద విహారి' సినిమాకి హీరో నాగశౌర్య (Naga Shaurya) తల్లిగారే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన కొడుకు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ బాధ్యతలను స్వీకరించారు. నాగశౌర్య తల్లిగారైన ఉషా ముల్పూరి గతంలో తన కుమారుడినే హీరోగా పెట్టి 'అశ్వథ్థామ' చిత్రాన్ని నిర్మించారు. 

నాగశౌర్య నటిస్తున్న 22వ చిత్రం

'కృష్ణ వ్రింద విహారి' అనేది హీరో నాగశౌర్య (Naga Shaurya) నటించిన 22వ చిత్రం. గతంలో ఆయన నటించిన చిత్రాలలో ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద, ఛలో, అశ్వత్ధామ చిత్రాలు నాగశౌర్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. 

ఎడిటర్ ఎవరో తెలుసా

ఎఫ్ 2, ఎఫ్ 3, బింబిసార, తిమ్మరుసు లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన బిక్కిన తమ్మిరాజు ఈ సినిమాకి కూడా కూర్పరిగా వ్యవహరించడం విశేషం.

 

 

Naga Shaurya

మహతి స్వరసాగర్ మ్యూజిక్

మహతి స్వరసాగర్ ఈ మధ్యకాలంలో మంచి పాటలను అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏకంగా మెగాస్టార్‌నే మెప్పించి "భోళా శంకర్" చిత్రానికి మ్యూజిక్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఈ యువ సంగీత దర్శకుడే 'కృష్ణ వ్రింద విహారి' సినిమాకి కూడా సంగీతాన్ని అందించడం గమనార్హం. 

సంగీత దర్శకుడితో హీరోకి నాల్గవ సినిమా

సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌, నాగశౌర్య (Naga Shaurya) కాంబినేషనులో వచ్చిన నాల్గవ సినిమా ఈ 'కృష్ణ వ్రింద విహారి'. గతంలో వీరిద్దరూ ఛలో, నర్తనశాల, జాదూగాడు సినిమాలకు కలిసి పనిచేశారు. 

 

Krishna Vrinda Vihari

వాయిదా పడుతూనే..

ఇప్పటికి ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. 2020 తొలిసారిగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. తర్వాత ఫిబ్రవరి 2022 నెలలో రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. తర్వాత ఆ డేట్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు సెప్టెంబర్ 23వ తేదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

అఫీషియల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్

ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ టీజర్ ఈ సంవత్సరం మే నెలలో విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది. దాదాపు 4 మిలియన్ల వ్యూస్‌ను ఈ టీజర్ సొంతం చేసుకుంది. అలాగే హీరో నాగశౌర్య (Naga Shaurya) కథానాయికతో మాట్లాడే సంభాషణలు కూడా పాపులర్ అయ్యాయి.

ఈ నెల 10వ తేదిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. అలాగే సినిమా సెప్టెంబర్ 23వ తేదిన విడుదల కానుంది. 

Read More: Phalana Abbayi Phana Ammayi: నాగశౌర్య, మాళవిక నాయర్‌ ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’.. క్రేజీ అప్ డేట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!