‘కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari) ప్రమోషన్లతో బిజిగా మారిన నాగశౌర్య (Naga Shaurya)..!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari). అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ షిర్లీ సెటియా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక, ఇప్పటికే ‘కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari) సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
అయితే అందరూ ఒక తరహాలో ప్రమోహన్స్ (Krishna Vrinda Vihari Promotions) చేస్తుంటే యువహీరో నాగశౌర్య మాత్రం రొటీన్ తరహా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ యంగ్ రిచ్ పీపుల్స్ తిరిగే ప్రదేశంలో ప్రమోషన్ చేస్తున్నాడు. సిటీలోని రెస్టారెంట్స్ పబ్స్ లలో ఎక్కువగా తిరుగుతున్నారు నాగ శౌర్య.
ఇదిలా ఉంటే.. తాజాగా 'కృష్ణ వ్రింద విహారి'లోని 'తార నా తార' పాట విడుదలయింది. హీరో నాగ శౌర్య, హీరోయిన్ షిర్లీ సెటియాల (Shirley Setia) అందమైన కెమిస్ట్రీని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు సంగీత దర్శకుడు మహతి.
ఇక, ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్ (Actress Radhika) కీలక పాత్రలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.