హీరో నాగశౌర్య(Naga Shourya) నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

Updated on Aug 25, 2022 08:48 PM IST
హీరో నాగశౌర్య(Naga Shourya) వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు
హీరో నాగశౌర్య(Naga Shourya) వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు

టాలీవుడ్​ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shourya) కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుదున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.  ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు.  ఈ సందర్భంగా ఉషా మూల్పూరి మీడియాతో ముచ్చటించారు.

‘ఈ కథను నాగశౌర్య ముందు విన్నారు. కథ చాలా బావుంది. పాండమిక్ లోనే స్టార్ట్ చేశాం. ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్ వైపు వుండడం, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం.అంటే సుందరానికి సినిమాకు, మా సినిమాకు పోలిక లేదండీ. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు అనీష్ ఆ సినిమా చూశారు. దానికి దీనికి ఎక్కడ పోలిక లేదు.

ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిణ్​ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్ లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. మొదట అనుకున్న విడుదల తేది పాండమిక్ కారణంగా అన్నీ సినిమాల్లానే ముందువెనుక అయ్యింది. అయితే మంచి సినిమా.. మంచి డేట్ చూసి రావాలని భావించాం. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.బ్రాహ్మిణ్​ పాత్ర కోసం రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందుకోసం దర్శకుడు ఒక ట్రైనర్ ని ఏర్పాటు చేశారు. డబ్బింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు’ అంటూ సినిమా కోసం నాగశౌర్య ఎలా కష్టపడ్డారో వివరించారు.

హీరో నాగశౌర్య(Naga Shourya) వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు

కమర్షియల్​ మూవీకంటే ఎక్కువ బడ్జెట్​..

‘200 మంది డ్యాన్సర్స్ తో చేసిన ఏముందిరా పాట కు చాలా  మంచి స్పందన వచ్చింది. దర్శకుడు ఆ సందర్భానికి అలాంటి గ్రాండ్ సాంగ్ వుంటే బావుంటుందని అనుకున్నారు. మంచి మ్యూజిక్ వచ్చింది. అలాగే లిరిక్స్ కూడా అద్భుతంగా కుదిరాయి. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. నిజం చెప్పాలంటే కమర్షియల్ మూవీ కంటే దీనికి ఎక్కువ బడ్జెట్ అయ్యింది.

 అనుకోకుండా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే ఉన్నాను.  ఈ సినిమా జరిగేటప్పుడు కూడా ఇదే చివరి సినిమా అనుకున్నాను. కానీ మా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇంకా సినిమాలు చేయాలని కోరారు. అందుకే నిర్ణయం మార్చుకొని వేరే హీరోలతో కూడా సినిమాలు చేయాలని భావిస్తున్నాను.  

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం ఉంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రింద విహారి అనే టైటిల్ పెట్టాం’ అంటూ సినిమా విశేషాలు పంచుకున్నారు నిర్మాత ఉష. నాగశౌర్య(Naga Shourya)  నటించిన ఈ సినిమా ప్రమోషన్స్​ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

Read More : ‘అర్జున్‌రెడ్డి’ విడుదలై అయిదేళ్లు..విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు థ్యాంక్స్: హీరోయిన్ షాలిని ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!