Phalana Abbayi Phana Ammayi: నాగశౌర్య, మాళవిక నాయర్‌ ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’.. క్రేజీ అప్ డేట్!

Updated on Jul 03, 2022 04:47 PM IST
హీరో నాగశౌర్య, మాళవిక నాయర్‌ (Nagashourya, Malavika nair)
హీరో నాగశౌర్య, మాళవిక నాయర్‌ (Nagashourya, Malavika nair)

టాలీవుడ్ యువ కథానాయకుడు నాగశౌర్య (Hero Nagashourya) ఇటీవల 'లక్ష్య', 'వరుడు కావలెను' సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరక్కుతున్న లేటెస్ట్ మూవీ “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. 

ప్రస్తుతం లండన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడి పలు అందమైన లొకేషన్స్ లో మూవీకి సంబందించిన కీలక తారాగణం పై సీన్స్ చిత్రికరిస్తోంది యూనిట్. గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్‌ (Malavika nair) జంటగా నటించిన కళ్యాణ వైభోగమే ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మాళవిక నాయర్ ఇప్పుడు హీరోయిన్ గా మళ్ళీ బిజీ అవుతోంది. నాగ చైతన్య సరసన ‘థాంక్యూ’ చిత్రంలో కూడా నటించింది ఈ భామ.

‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ మూవీ టీమ్ (Phalana Abbayi Phana Ammayi Movie Team)

అలాగే శ్రీనివాస్‌ అవసరాల (Srinivas avasarala), నాగశౌర్య కాంబినేషన్‌లో రూపొందిన ఊహలు గుసగుసలాడే,  జో అచ్చుతానంత చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని బజ్‌ బావుంది. విజయ వంతమైన చిత్రాల నాయక, నాయికలు, దర్శకుడు కాంబినేషన్‌లో ఈ చిత్రం తీయడం ఆనందంగా ఉంది’ అని నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్‌, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్‌ కూచిభోట్ల తెలిపారు.

ఒకానొక సమయంలో అసలు ఈ ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phana Ammayi) సినిమా ఉందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని దాదాపుగా పక్కనపెట్టేశారని రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు 'ఫలానా..' మూవీ షూటింగ్ కు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుపుకుంటోందని తెలిపారు.

Read More: Ramarao on duty: రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి ‘నా పేరు సీసా..’ ఐటమ్ సాంగ్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!