Aishwarya Rai Bachchan: కూతురుకు లిప్ కిస్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌ను చుట్టుముట్టిన ట్రోల్స్
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai Bachchan)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 49 ఏళ్ల వయసులోనూ వన్నె తరగని అందంతో ఆమె పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నారు. అందంతోపాటు అభినయంతోనూ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని ఆమె నిరూపించుకున్నారు. అందుకే ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఇకపోతే, ఐశ్వర్యను సోషల్ మీడియాలో ట్రోల్స్ చుట్టుముట్టాయి. కుమార్తె ఆరాధ్య (Aaradhya Bachchan)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని పలువురు సోషల్ మీడియా యూజర్స్ తప్పుబడుతున్నారు. మీరు కూడా ఇలా చేస్తారా అంటూ ఆమెపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆమెపై వాళ్లు ఇంతగా ఆగ్రహానికి గురి కావడానికి ఓ కారణం ఉంది.
ఐశ్వర్య గారాలపట్టి ఆరాధ్య జన్మదినం ఇవాళే. తన ముద్దుల తనయకు బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యూ ఆరాధ్య’ అని పేర్కొంటూ కుమార్తెతో దిగిన ఒక ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఆమె ఆరాధ్యకు లిప్ కిస్ ఇస్తూ కనిపించారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ ఐష్‌ను విమర్శిస్తున్నారు.
‘చిన్నారి పెదవుల మీద ముద్దుపెట్టుకోవడం వింతగా ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో నెటిజన్.. ‘మేడమ్.. ఇలాంటివి చేసి మీరు ఇతరుల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం లేదు’ అంటూ విమర్శించారు. ఇదిలాఉండగా.. మరికొంత మంది ఫ్యాన్స్ మాత్రం.. ‘ఈ ఫొటోలో తప్పేముంది?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘తల్లీకూతుళ్ల బంధాన్ని తప్పుబట్టాల్సిన అవసరం ఏముంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై ఐష్ స్పందిస్తారేమో చూడాలి.
Read more: ఆర్మాక్స్ టాలీవుడ్ సెలబ్రిటీ లిస్ట్..వరుసగా నాలుగోసారి ఫస్ట్ ప్లేస్‌లో ప్రభాస్ (Prabhas)